నేడు కలెక్టర్లకు ఆర్టీసీ ఉద్యోగుల వినతిపత్రాలు
ABN , Publish Date - Jul 27 , 2026 | 04:35 AM
ర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు సోమవారం ఉద్యోగుల సంతకాలతో కూడిన వినతి పత్రాలను..
విజయవాడ (బస్‌స్టేషన్), జూలై 26 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు సోమవారం ఉద్యోగుల సంతకాలతో కూడిన వినతి పత్రాలను అందజేస్తామని, వారిద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమర్పించనున్నామని ఆర్టీసీ ఉద్యోగ సంఘాల కన్వీనర్లు వై.శ్రీనివాసరావు, పలిశెట్టి దామోదర్‌రావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ బస్సులను ప్రైవేట్ ఆపరేటర్ల ద్వారా నడపాలనే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని, ఆర్టీసీ ద్వారానే విద్యుత్ బస్సులు కొని, ఆర్టీసీ ఉద్యోగులతోనే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.