Share News

ఏపీలో పెద్ద సినిమాకు క్లాప్ కొట్టి 20 ఏళ్లు అయింది: బాలకృష్ణ

ABN , Publish Date - Jun 25 , 2026 | 10:40 AM

ఏపీ రాజధాని అమరావతిలో నందమూరి నటసింహం బాలకృష్ణ 112వ చిత్రం గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది. సినిమా ఓపెనింగ్ కోసం వచ్చిన మంత్రులు నారా లోకేశ్, కందుల దుర్గేష్‌కు బాలయ్య ధన్యవాదాలు తెలిపారు

ఏపీలో పెద్ద సినిమాకు క్లాప్ కొట్టి 20 ఏళ్లు అయింది: బాలకృష్ణ
Nandamuri Balakrishna

అమరావతి, జూన్ 25: ఏపీ రాజధాని అమరావతిలో నందమూరి నటసింహం బాలకృష్ణ 112వ చిత్రం గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది. సినిమా ప్రారంభోత్సవ వేడుకలకు మంత్రులు నారా లోకేశ్, కందుల దుర్గేష్ ముఖ్య అతిథులుగా హాజరై.. క్లాప్ కొట్టి, కెమెరా స్విచ్‌ఆన్ చేశారు. ఈ సందర్భంగా హీరో బాలకృష్ణ మాట్లాడుతూ.. సినిమా ఓపెనింగ్ కోసం వచ్చిన మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సినిమా మొదటి షాట్‌ను డైరెక్ట్ చేసిన నందమూరి తేజస్వినికి ధన్యవాదాలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద సినిమాకి క్లాప్ కొట్టి 20 సంవత్సరాలు అయ్యిందన్నారు. ఏపీలో సినీ పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కృషి చేస్తున్నారని అన్నారు. పర్యాటక రంగం, సినీ పరిశ్రమ రెండూ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని బాలయ్య తెలిపారు.


సినీ ఇండస్ట్రీని ప్రోత్సహిస్తాం: మంత్రి లోకేశ్

సినీ ఇండస్ట్రీని ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి లోకేశ్ తెలిపారు. సినిమాతో పాటు థియేటర్ ఎకనామిని ప్రోత్సహిస్తామన్నారు. AI టెక్నాలజీతో సినిమా పరిశ్రమను మరింత ఉన్నతికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని సినిమాలు అమరావతి నుంచే ప్రారంభం కావాలని కోరుకుంటున్నట్లు మంత్రి తెలిపారు.


సినీ పరిశ్రమకు సంపూర్ణ సహకారం: మంత్రి కందుల

సినీ పరిశ్రమకు సంపూర్ణ సహకారం అందిస్తామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. స్టూడియోలు, రికార్డింగ్ థియేటర్లకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. త్వరలో సినీ పరిశ్రమకు చెందిన స్టూడియో కూడా రావాలని కందుల దుర్గేష్‌ ఆకాంక్షించారు.


బాలయ్యకు దర్శకత్వం నా అదృష్టం: కొరటాల శివ

అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు బాలయ్య బాబు కోసం ఒక సినిమా రాశానని దర్శకుడు కొరటాల శివ అన్నారు. రైటర్‌గా కూడా ఒక సినిమా రాసినట్లు చెప్పారు. ఇప్పుడు బాలయ్య బాబుకు దర్శకత్వం వహించడం తన అదృష్టమని శివ చెప్పుకొచ్చారు.


ఇవి కూడా చదవండి...

వెనెజువెలాలో వరుస భూకంపాలు.. సంచలనం రేపుతున్న వీడియోలు..

సెట్స్‌పైకి బాలయ్య సరికొత్త చిత్రం #NBK112.. అమరావతిలో సినీ సందడి

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 25 , 2026 | 12:52 PM