Share News

సెట్స్‌పైకి బాలయ్య సరికొత్త చిత్రం #NBK112.. అమరావతిలో సినీ సందడి

ABN , Publish Date - Jun 25 , 2026 | 09:45 AM

ఏపీ రాజధాని అమరావతిలో సినీ సందడి మొదలైంది. ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో NBK 112వ సినిమా మొదలైంది.

సెట్స్‌పైకి బాలయ్య సరికొత్త చిత్రం #NBK112.. అమరావతిలో సినీ సందడి
Balakrishna New Movie

అమరావతి, జూన్ 25: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో సినీ సందడి మొదలైంది. నటసింహం నందమూరి బాలకృష్ణ, ప్రముఖ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం NBK 112 ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. హీరో బాలకృష్ణ సరికొత్త చిత్రం #NBK112 సెట్స్‌పైకి చేరింది. ఈరోజు(గురువారం) వెంకటపాలెంలోని బిట్స్ పిలానీ గ్రౌండ్‌లో మూవీ ప్రారంభోత్సవ వేడుక జరిగింది. ముహూర్తపు వేడుకకు మంత్రులు నారా లోకేశ్, కందుల దుర్గేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా క్లాప్ కొట్టి, కెమెరా స్విచ్ఛాన్ చేశారు మంత్రులు. ముహూర్తపు షాట్‌కు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ యాక్షన్ చెప్పారు.


బ్లాక్‌బస్టర్ విజయాలతో ప్రత్యేక గుర్తింపు పొందిన దర్శకుడు కొరటాల శివ, మాస్ ఇమేజ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన బాలకృష్ణ కాంబినేషన్‌లో వస్తున్న NBK 112పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని ప్రముఖ నిర్మాతలు చెరుకూరి సుధాకర్, సుధాకర్ మిక్కిలినేని నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని విశేషాలను NBK 112 గ్రాండ్ లాంచ్ ఈవెంట్‌లో మీడియాతో పంచుకోనున్నట్లు నిర్మాతలు వెల్లడించారు. బాలకృష్ణ భారీ ప్రాజెక్ట్‌ NBK 112పై టాలీవుడ్‌లో ఆసక్తి నెలకొంది. సినిమా ప్రారంభోత్సవ వేడుకకు పెద్ద సంఖ్యలో బాలయ్య అభిమానులు హాజరయ్యారు. దీంతో రాజధాని అమరావతిలో సందడి వాతావరణం నెలకొంది.


ఇవి కూడా చదవండి...

యువకుడి ఆత్మహత్యాయత్నం.. సంచలనంగా సెల్ఫీ వీడియో

వెనెజువెలాలో వరుస భూకంపాలు.. సంచలనం రేపుతున్న వీడియోలు..

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 25 , 2026 | 10:04 AM