Share News

జగ్గయ్యపేట సీఐ తీరుపై మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆగ్రహం

ABN , Publish Date - Aug 23 , 2026 | 10:24 AM

జగ్గయ్యపేట సీఐ తీరుపై మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలకు సీఐ వెంకటేశ్వర్లు అతిగౌరవం చూపించారని ఫిర్యాదులు అందడంతో సీరియస్ అయ్యారు.

జగ్గయ్యపేట సీఐ తీరుపై మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆగ్రహం
AP Minister Anagani Satya Prasad

కృష్ణా జిల్లా, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): జగ్గయ్యపేట సీఐ తీరుపై మంత్రి అనగాని సత్యప్రసాద్ (AP Minister Anagani Satya Prasad) ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలకు సీఐ వెంకటేశ్వర్లు అతిగౌరవం చూపించారని ఫిర్యాదులు అందడంతో సీరియస్ అయ్యారు. వివాహ వేడుకలో వైసీపీ నేతలు వెలంపల్లి శ్రీనివాస్, దేవినేని అవినాశ్‌కు సీఐ ప్రాధాన్యం ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. మంత్రి కాన్వాయ్ ఉన్నా వాహనాలను సీఐ ఎందుకు క్లీయర్ చేయలేదని నిలదీశారు.


అంగరక్షకుడిని పంపిన తర్వాతే మంత్రి వద్దకు సీఐ వచ్చారని మంత్రి అన్నారు. తాను అన్నీ చూస్తున్నానని.. ప్రభుత్వం మారిందయ్యా అంటూ మంత్రి వ్యాఖ్యానించారు. సీఐ తీరుపై పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబుకు మంత్రి ఫిర్యాదు చేశారు. సీఐతో మాట్లాడి కమిషనర్ వివరణ తీసుకున్నారు. ప్రముకుల పర్యటనల్లో ప్రొటోకాల్ తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. గతంలో వెలంపల్లి మంత్రిగా ఉన్న సమయంలో విజయవాడ వన్‌టౌన్ సీఐగా వెంకటేశ్వర్లు పనిచేసిన విషయం తెలిసిందే.


వార్తలు కూడా చదవండి...

ఉద్యోగాలు, ప్రతిభకు దేశంలోనే నంబర్‌వన్ సిటీగా విశాఖ: సీఎం చంద్రబాబు

పవన్ కల్యాణ్ దిశానిర్దేశం.. శరవేగంగా అడవుల పునరుద్ధరణ కార్యక్రమం

ఈ ఏడాది మరో 3వేల టీచర్ పోస్టుల భర్తీ: మంత్రి లోకేశ్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Aug 23 , 2026 | 10:32 AM