Share News

రేపే అన్నదాత సుఖీభవ నిధుల విడుదల.. 46.85 లక్షల రైతు కుటుంబాలకు లబ్ధి

ABN , Publish Date - Oct 29 , 2026 | 02:50 PM

అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ రెండో విడత నిధులు రేపు విడుదలకానున్నాయి. ఈ మేరకు ఏపీ కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు. రబీ రైతుల కోసం అనుకున్న సమయానికంటే ముందుగా పీఎం కిసాన్ నిధులు విడుదల చేయాలని కేంద్రం నిర్ణయించింది.

రేపే అన్నదాత సుఖీభవ నిధుల విడుదల.. 46.85 లక్షల రైతు కుటుంబాలకు లబ్ధి
Andhra Pradesh Farmers

అమరావతి, అక్టోబర్ 29: అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ రెండో విడత నిధులు రేపు(శుక్రవారం) విడుదలకానున్నాయి. ఈ మేరకు ఏపీ కేబినెట్‌లో నిధుల విడుదలకు నిర్ణయం తీసుకున్నారు. రబీ రైతుల కోసం అనుకున్న సమయానికంటే ముందుగా పీఎం కిసాన్ నిధులు విడుదల చేయాలని కేంద్రం నిర్ణయించింది. పీఎం కిసాన్ నిధులు విడుదల చేస్తున్న సందర్భంగా రేపే అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో రెండో విడత కింద అక్టోబర్ 30న అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకం నిధులను ఏపీ ప్రభుత్వం విడుదల చేయనుంది.


ఈ విడతలో రాష్ట్రవ్యాప్తంగా 46,85,838 రైతు కుటుంబాలకు రూ.3,125 కోట్ల ఆర్థిక సాయం అందనుంది. అన్నదాత సుఖీభవ 2026-27 సంవత్సరానికి 2వ విడతలో ప్రతి రైతు కుటుంబానికి రూ.7,000 సాయం అందించనున్నారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.5,000, కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ ద్వారా వాటాగా రూ.2,000 ఇవ్వనున్నారు. ఈ విడత విడుదల మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.2,342.92 కోట్లు, పీఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వ వాటాగా రూ.782.55 కోట్లు రైతుల కుటుంబాలకు అందజేయనున్నారు.


అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ ద్వారా అర్హులైన రైతు కుటుంబాలకు ఏటా రూ.20,000 ఆర్థిక సాయాన్ని కూటమి ప్రభుత్వం అందిస్తోంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటాగా రూ.14,000, కేంద్ర ప్రభుత్వం రూ.6,000 వాటాగా చెల్లిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి విడతను 20 జూన్ 2026న విడుదల చేశారు. ఈ ఏడాది మొదటి విడతలో 46,85,838 రైతు కుటుంబాలకు రూ.3,125.47 కోట్ల సాయాన్ని అందించారు. గతేడాది ఆగస్ట్ 2న ప్రారంభించిన ఈ పథకం ద్వారా 2025-26 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం, రాష్ట్ర వాటా కలిపి రూ.8,985.41 కోట్లను రైతులకు అందజేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నదాత సుఖీభవ పథకం కింద రేపటి విడతతో కలిపి ఇప్పటివరకు మొత్తం రూ.15,236.35 కోట్లు రైతు కుటుంబాలకు అందజేయగా.. ఇందులో రాష్ట్ర వాటా రూ.11,246.02 కోట్లు, కేంద్రం వాటాగా రూ.3,990.33 కోట్లు అందజేశారు.


ఇవి కూడా చదవండి...

ఆర్నబ్ తుఫాన్‌పై అమిత్ షా సమీక్ష.. త్వరలోనే బాధిత రాష్ట్రాలకు కేంద్ర బృందాలు

పొత్తు ధర్మం పాటించాల్సిందే.. రెబల్స్‌ను సస్పెండ్ చేయండి: సీఎం చంద్రబాబు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 29 , 2026 | 03:05 PM