తుఫాన్ నష్టంపై కేబినెట్‌లో చర్చ.. బాధితులకు పరిహారం ఇవ్వాలని పవన్ విజ్ఞప్తి
ABN , Publish Date - Oct 29 , 2026 | 01:29 PM
సీఎం చంద్రబాబు అధ్యక్షతన హైబ్రిడ్ విధానంలో జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఆర్నబ్ తుఫాన్ నష్టం, సహాయక చర్యలపై కేబినెట్ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది.
అమరావతి, అక్టోబర్ 29: సీఎం చంద్రబాబు అధ్యక్షతన హైబ్రిడ్ విధానంలో జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఆర్నబ్ తుఫాన్ నష్టం, సహాయక చర్యలపై కేబినెట్ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. ఉప్పాడ తీరంలో 40 బోట్లు, కోనసీమ జిల్లా పరిధిలో ఉప్పాడ మత్స్యకారుల 117 బోట్లు దెబ్బతిన్నాయని తెలిపారు. తీర ప్రాంతంలో బోట్లు, వలలు, వేట సామగ్రి కోల్పోయిన మత్స్యకారులందరికీ వెంటనే నష్టపరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. భారీ వర్షాలతో ఉప్పాడలో మగ్గాల్లోకి నీరు చేరి చేనేత కార్మికుల జీవనోపాధి దెబ్బతిందని, వారిని కూడా ఆదుకోవాలని కోరారు.
విపత్తు నిర్వహణలో ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకు సీఎం చంద్రబాబు అత్యంత ప్రాధాన్యమిచ్చి సమర్థంగా వ్యవహరించారని పవన్ కొనియాడారు. తుఫాన్ హెచ్చరికల నుంచి నిరంతరం సమీక్షిస్తూ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన ముఖ్యమంత్రి పనితీరు ప్రశంసనీయమన్నారు. తుఫాన్ సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొన్న కేబినెట్ సహచరులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ శాఖల సిబ్బందికి ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అభినందనలు తెలియజేశారు.
ఇవి కూడా చదవండి...
ఆర్నబ్ తుఫాన్‌పై అమిత్ షా సమీక్ష.. త్వరలోనే బాధిత రాష్ట్రాలకు కేంద్ర బృందాలు
ఆర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రోడ్ల పరిస్థితిని బట్టి ఆర్టీసీ బస్సుల పునరుద్ధరణ: మంత్రి మండిపల్లి
Read Latest AP News And Telugu News