Share News

ఏపీ మద్యం రవాణా స్కాం.. అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు

ABN , Publish Date - Sep 24 , 2026 | 03:09 PM

ఏపీ మద్యం రవాణా కుంభకోణం కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. రేపు విచారణకు రావాల్సిందిగా ఫోన్‌ ద్వారా మాజీ మంత్రికి ఈడీ సమాచారం పంపించింది.

ఏపీ మద్యం రవాణా స్కాం.. అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు
Former Minister Ambati Rambabu

అమరావతి, సెప్టెంబర్ 24: ఏపీ మద్యం రవాణా కుంభకోణం కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు(Ambati Rambabu) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులు జారీ చేసింది. రేపు(శుక్రవారం) విచారణకు రావాల్సిందిగా ఫోన్‌ ద్వారా మాజీ మంత్రికి ఈడీ సమాచారం పంపించింది. ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్ ఈడీ కార్యాలయానికి విచారణకు హాజరుకావాలని అధికారులు కోరారు. అయితే తాను 15 రోజుల క్రితం గుండెకు స్టంట్‌లు వేయించుకున్నానని ఈడీకి అంబటి సమాధానం ఇచ్చారు. డాక్టర్ల సూచన మేరకు ప్రస్తుతం కోలుకుంటున్నానని చెప్పుకొచ్చారు. పూర్తిగా కోలుకున్న తర్వాత అధికారులకు ముందుగా సమాచారం ఇచ్చి విచారణకు వస్తానని మెసేజ్ పంపించారు. తప్పనిసరిగా విచారణకు సహకరిస్తానని ఈడీకి ఇచ్చిన మెసేజ్‌లో అంబటి రాంబాబు పేర్కొన్నారు. అయితే, మాజీ మంత్రి ఇచ్చిన రిప్లై‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు స్పందించాల్సి ఉంది.


మరోవైపు మద్యం రవాణా కుంభకోణంలో ఈరోజు మర్రి సుబ్బారెడ్డి, పురుషోత్తం రావుల స్టేట్మెంట్‌లను ఈడీ అధికారులు రికార్డ్ చేశారు. ఈరోజు ఉదయం ఈ కేసుకు సంబంధించి వీరిని ఈడీ అధికారులు ప్రశ్నించారు. గత వైసీపీ హయాంలో ప్రభుత్వ మద్యం దుకాణాలకు లిక్కర్‌ను రవాణా చేసేందుకు సిగ్మా, ప్రసాద్ ట్రాన్స్‌పోర్ట్ సంస్థలకు కాంట్రాక్టులు ఇచ్చినట్లు ఈడీ గుర్తించింది. మొదటి కాంట్రాక్టు కాలంలో మర్రి సుబ్బారెడ్డి, రాయపాటి పురుషోత్తమరావు కలిసి సుమారు రూ.59.14 లక్షల మద్యం పెట్టెలను రవాణా చేసిన దానిపై ఈడీ ప్రశ్నించినట్లు తెలుస్తోంది.


సిగ్మా సంస్థ నుంచి రూ.15.44 కోట్లు పొందారని ఈడీ విచారణలో వెల్లడించింది. లిక్కర్ రవాణా సబ్‌కాంట్రాక్టులు, నిధుల మళ్లింపు, మాజీ మంత్రి అంబటి రాంబాబుతో ఉన్న సంబంధాలపై అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. పురుషోత్తమరావు, మర్రి సుబ్బారెడ్డి ఇచ్చిన వాంగ్మూలాలను ఈడీ, సిట్ అధికారులు నమోదు చేసుకున్నారు. ట్రాన్స్‌పోర్ట్ ఛార్జీలను భారీగా పెంచడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.195 కోట్లకు పైగా నష్టం జరిగినట్లు ఈడీ గుర్తించింది.


ఇవి కూడా చదవండి...

విద్యుత్ వైర్లు తెగితే వెంటనే సమాచారం ఇవ్వాలి: మంత్రి గొట్టిపాటి రవికుమార్

వాయుగుండం ఎఫెక్ట్.. ఎన్టీఆర్ జిల్లాలో భారీ వర్షాలు.. కలెక్టర్ కీలక ఆదేశాలు

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 24 , 2026 | 03:23 PM