Share News

గోదావరికి వరద ముప్పు.. ఈనెల 26 నాటికి 10 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చే అవకాశం

ABN , Publish Date - Sep 24 , 2026 | 02:51 PM

భారీ వర్షాల నేపథ్యంలో గోదావరికి వరద ప్రవాహం పెరుగుతోంది. ఈనెల 26 నాటికి 10లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో గోదావరికి మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

గోదావరికి వరద ముప్పు.. ఈనెల 26 నాటికి 10 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చే అవకాశం
Godavari Floods

కోనసీమ, సెప్టెంబర్ 24: భారీ వర్షాల నేపథ్యంలో గోదావరికి వరద ప్రవాహం పెరుగుతోంది. ఈనెల 26 నాటికి 10లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో గోదావరికి మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. సెప్టెంబర్ 27 నాటికి రెండో ప్రమాద హెచ్చరిక స్థాయికి వరద చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో భారీ వర్షాలు, గోదావరి వరదలపై జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధమైంది.


ప్రజల భద్రతకు అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. గత 24 గంటల్లో జిల్లాలో 114 మి.మీ. సగటు వర్షపాతం నమోదు అయినట్లు కలెక్టర్ చెప్పారు. రానున్న మూడు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రాహుల్ మీనా హెచ్చరించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. ముంపు ప్రాంతాల్లో ప్రత్యేక పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు ఎస్పీ రాహుల్ మీనా వెల్లడించారు.


వినాయక నిమజ్జనాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. నిమజ్జన ఘాట్ల వద్ద నీటిలోకి దిగకుండా జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ తెలిపారు. వినాయక నిమజ్జనాలకు క్రేన్లు, భద్రతా ఏర్పాట్లను సిద్ధం చేశామన్నారు. వర్షాల కారణంగా పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రస్తుతానికి సెలవులు ప్రకటించినట్లు తెలిపారు. ‘అవేర్’ యాప్ ద్వారా వాతావరణ హెచ్చరికలు తెలుసుకోవాలని.. అత్యవసర సమస్యల పరిష్కారానికి జిల్లా కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని చెప్పారు. కంట్రోల్ రూం నంబర్: 08856-293104‌కు ఫిర్యాదు అందిన రెండు గంటల్లో సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. పోలీస్, అధికార యంత్రాంగానికి ప్రజలు సహకరించాలని ఎస్పీ రాహుల్ మీనా పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

వరదలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ.. జాగ్రత్తలు తీసుకోండి: కలెక్టర్లతో సీఎం చంద్రబాబు

దసరా ఉత్సవాలు.. అస్సాం ప్రముఖులకు ఎంపీ చిన్ని ప్రత్యేక ఆహ్వానం

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 24 , 2026 | 03:25 PM