ఇంట్లో నిద్రిస్తున్న వృద్ధురాలి గొంతు కోసి దారుణ హత్య
ABN , Publish Date - Sep 24 , 2026 | 09:50 AM
సంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వృద్ధురాలిని గుర్తుతెలియని దుండగులు అతికిరాతకంగా హత్య చేశారు. పుల్కల్ మండలం పెద్దారెడ్డిపేటలో ఈ ఘటన జరిగింది.
సంగారెడ్డి, సెప్టెంబర్ 24: జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వృద్ధురాలిని గుర్తుతెలియని దుండగులు అతికిరాతకంగా హత్య చేశారు. పుల్కల్ మండలం పెద్దారెడ్డిపేటలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన పోచమ్మ(75) కొన్నేళ్లుగా ఒంటరిగా ఉంటోంది. ఈ క్రమంలో గత రాత్రి కొందరు గుర్తుతెలియని దుండగులు పోచమ్మ ఇంట్లోకి ప్రవేశించారు. నిద్రిస్తున్న వృద్ధురాలి గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. ఆపై ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను తీసుకుని దుండగులు అక్కడి నుంచి పరరాయ్యారు. ఉదయం స్థానికులు వచ్చి చూడగా వృద్ధురాలు రక్తపుమడుగులో కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. వృద్ధురాలి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే తెలిసిన వారే పోచమ్మను హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
పుష్కర ఘాట్లలో నీటి నాణ్యతపై పర్యవేక్షణ
Read Latest Telangana News And Telugu News