Share News

రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా ప్రకటిస్తాం.. రూ.లక్ష కోట్లతో అభివృద్ధి: మంత్రి సవిత

ABN , Publish Date - Sep 30 , 2026 | 03:21 PM

రైజింగ్ రాయలసీమ కోసం రాయలసీమ బిడ్డగా ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలు పోరాడుతున్నారని మంత్రి సవిత తెలిపారు. రాయలసీమ హార్టికల్చర్ హబ్‌కు సంఘీభావంగా పులివెందులలో టీడీపీ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు.

 రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా ప్రకటిస్తాం.. రూ.లక్ష కోట్లతో అభివృద్ధి: మంత్రి సవిత
Minister Savitha

కడప, సెప్టెంబర్ 30: ‘రైజింగ్ రాయలసీమ’ కోసం రాయలసీమ బిడ్డగా ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలు పోరాడుతున్నారని మంత్రి సవిత తెలిపారు. రాయలసీమ హార్టికల్చర్ హబ్‌కు సంఘీభావంగా పులివెందులలో టీడీపీ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మంత్రి సవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా సీఎం ప్రకటిస్తారని చెప్పారు. హార్టికల్చర్ హబ్ కోసం లక్ష కోట్లు ఖర్చు చేస్తామన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులకు రూ.26 వేల కోట్లు కేటాయిస్తామని వెల్లడించారు.


ప్రతి ఎకరాకు నీరు అందించడంతో పాటు వేర్ హౌజ్, కోల్డ్ స్టోరేజ్ నిర్మాణాలు చేపడతామని మంత్రి తెలిపారు. పులివెందులకు కూడా వైఎస్ జగన్ సాగు నీరు ఇవ్వలేకపోయారని విమర్శించారు. పులివెందులలో రూ.480 కోట్లతో తాగు నీరు అందిస్తున్నామని తెలిపారు. ఇటీవల పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ప్రజలు టీడీపీని భారీ మెజారిటీతో గెలిపించారని అన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పులివెందుల మున్సిపాలిటిలో ప్రజలు టీడీపీని గెలిపించాలని కోరారు. పులివెందుల అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు కట్టుబడి ఉన్నారని మంత్రి సవిత స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి...

ఏషియన్ గేమ్స్‌లో భారత మహిళల ఆర్చరీ జట్టుకు స్వర్ణం.. మంత్రి మండిపల్లి అభినందనలు

దసరా మహోత్సవాలకు రండి.. సీఎం చంద్రబాబుకు ఆహ్వానం

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 30 , 2026 | 04:09 PM