Share News

ఏపీ మద్యం స్కాం.. A2 వాసుదేవరెడ్డి బినామీ ఆస్తుల గుట్టు విప్పుతున్న ఐటీ

ABN , Publish Date - Nov 12 , 2026 | 11:42 AM

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో బినామీ ఆస్తులపై ఐటీ అధికారులు గురువారం ముమ్మరంగా విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే A2 వాసుదేవరెడ్డి బినామీ ఆస్తుల గుట్టు విప్పుతున్నారు.

ఏపీ మద్యం స్కాం.. A2 వాసుదేవరెడ్డి బినామీ ఆస్తుల గుట్టు విప్పుతున్న ఐటీ
AP Liquor Scam Case

హైదరాబాద్, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో (AP Liquor Scam Case) బినామీ ఆస్తులపై ఐటీ అధికారులు ఈరోజు (గురువారం) ముమ్మరంగా విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే A2 వాసుదేవరెడ్డి బినామీ ఆస్తుల గుట్టు విప్పుతున్నారు. లిక్కర్ స్కామ్ ద్వారా కొల్లగొట్టిన సొమ్మును తన బావమరిది నరసింహరెడ్డి పేరు మీద పలు ఆస్తులను కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. హైదరాబాద్ తుక్కుగుడా సమీపంలోని మంఖాల్ గ్రామంలో కోట్ల విలువైన విల్లాతో పాటు ఈ బినామీ లావాదేవీకి సంబంధించి బ్యాంకు అకౌంట్స్‌లో ఉన్న రూ.3.5 కోట్లను ఐటీ అధికారులు జప్తు చేశారు.


ఏపీ లిక్కర్ సరఫరా ఆర్డర్లు ఇచ్చినందుకు వాసుదేవరెడ్డికి లంచంగా చెల్లించాల్సిన సొమ్మును సెల్స్ ప్రమోషన్ కమీషన్ ముసుగులో ఆయా సంస్థల నుంచి VNR గ్లోబల్ ఖాతాల్లోకి జమ అయినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. డేటా ఎవాల్వ్ అనే సంస్థ నుంచి విజయనరసింహారెడ్డికి చెందిన 2 సంస్థలకు వడ్డీలేని రుణాలను మళ్లించినట్లుగా అధికారుల దర్యాప్తులో తేలింది. రూ.6 కోట్లు వడ్డీ లేని, తిరిగి చెల్లించాల్సిన అవసరం లేని రుణాలు కూడా.. ఇదంతా మద్యం లంచాల సొమ్ముగానే అతనికి వచ్చినట్లుగా గుర్తించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మిల్క్ చిల్లింగ్ పాయింట్ సంస్థలో విజయ నరసింహారెడ్డి రూ.8.50 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు ఐటీ అధికారుల దర్యాప్తులో తేలింది.


ఈ వార్తలు కూడా చదవండి..

‘సర్’ పేరుతో మైనారిటీలు, దళితులు, పేదల ఓట్లను మోదీ సర్కార్ తొలగిస్తోంది: సీఎం రేవంత్‌రెడ్డి

మహబూబాబాద్ జిల్లాలో దారుణం.. ప్రేమ పేరుతో మైనర్‌కు వంచన

ప్రొబేషనరీ డీఎస్పీల ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 12 , 2026 | 12:20 PM