జనసేన నేత హత్యకు వైసీపీ కుట్ర.. పోలీసుల అదుపులో నరేంద్ర రెడ్డి
ABN , Publish Date - Sep 01 , 2026 | 04:57 PM
అక్షరాలా కోటిన్నర రూపాయల సుపారీ ఇచ్చి జనసేన నాయకుడు బోనబోయిన శ్రీనివాస యాదవ్ హత్యకు వైసీపీ నేత నరేంద్ర రెడ్డి కుట్రపన్నారు. విషయం బయటకు రావడంతో పోలీసులు నరేంద్ర రెడ్డిని అరెస్ట్ చేశారు.
గుంటూరు, సెప్టెంబరు 1: జనసేన నాయకుడు బోనబోయిన శ్రీనివాస యాదవ్ హత్యకు కుట్రపన్నిన కేసును పోలీసులు ఛేదించారు. ఆయన్ను హత్య చేయించడానికి వైసీపీ నేత కంకర నరేంద్ర రెడ్డి రౌడీలకు సుపారీ ఇచ్చినట్టు గుర్తించారు. దీంతో నల్లపాడు పోలీసులు ఈ రోజు(మంగళవారం) నరేంద్ర రెడ్డిని అదుపులోకి తీసుకుని, జిల్లా కోర్టులో హాజరుపరిచారు.
శ్రీనివాస యాదవ్‌ను హతమార్చేందుకు వైసీపీ నేత ఓ గ్యాంగ్‌కు రూ.1.5 కోట్లు సుపారీ ఇచ్చినట్టు గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ముందస్తు సమాచారంతో సదరు జనసేన నేత పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ కేసులో సుపారీ తీసుకున్న రౌడీషీటర్ ఇప్పటికే లొంగిపోయాడు. సమగ్ర విచారణ జరిపిన నల్లపాడు పోలీసులు నరేంద్ర రెడ్డిని అరెస్ట్ చేశారు. వైసీపీ హయాంలో నరేంద్ర రెడ్డి ఎన్నో అరాచకాలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ అరాచకాలను జనసేన నేత బోనబోయిన అడ్డుకున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన హత్యకు వైసీపీ నేత కుట్రచేసినట్టు ప్రచారం సాగుతోంది.
ఇవీ చదవండి:
‘ఆపరేషన్ సిందూర్’లో అదరగొట్టిన ఎస్-400కు మరో ఆర్డర్!
పీఎన్బీలో కరెన్సీ చెస్ట్‌లో నకలీ నోట్ల కలకలం.. ముగ్గురి అరెస్ట్