వివేకా హత్య కేసులో శివశంకర్ రెడ్డిని ప్రశ్నిస్తున్న ఈడీ.. మనీలాండరింగ్ కోణంలో విచారణ
ABN , Publish Date - Oct 12 , 2026 | 05:30 PM
వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసుకు సంబంధించి నిందితుల విచారణ పరంపర కొనసాగుతోంది. నిందితుల్లో ఒకరైన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని హైదరాబాద్ కార్యాలయంలో ఈడీ ఈరోజు(సోమవారం) ఆరు గంటలుగా ప్రశ్నిస్తోంది.
అమరావతి, అక్టోబర్ 12: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితుల్లో ఒకరైన దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డిని ఈడీ ఈరోజు(సోమవారం) విచారణ చేస్తోంది. మనీలాండరింగ్ కోణంలో నిందితుడిని లోతుగా విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది.
వివేకాను హతమార్చడానికి చెల్లించిన అడ్వాన్స్ గురించి నిందితుడు దేవిరెడ్డిని ఈడీ ఆరా తీస్తున్నట్లు సమాచారం. హత్యకు ముందు ఎంత చెల్లించారు, ఆ తర్వాత ఎంత సొమ్మును చెల్లించారు. డబ్బు బ్యాంకు ఖాతాల ద్వారా బదిలీ అయ్యిందా? నగదు రూపంలో చెల్లింపులు జరిగాయా? ఎవరెవరి మధ్య ఈ చెల్లింపులు జరిగాయి? అనే కోణంలో బ్యాంకు లావాదేవీలను ఈడీ క్షుణ్నంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మనీలాండరింగ్‌లో ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారనే విషయంపైనా కూపీ లాగుతున్నట్లు సమాచారం. అంతకుముందు విచారణ చేసిన నిందితులు ఇచ్చిన స్టేట్‌మెంట్ల ఆధారంగా ప్రశ్నలు సంధిస్తూ.. వివరాలు లాగుతున్నట్లు తెలుస్తోంది. వైఎస్ వివేకా హత్యకు వేసిన స్కెచ్‌పై, హత్య తర్వాత నిందితుల ఫోన్ కాల్స్‌పై కూడా ఈడీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. వివేకా హత్య కేసు నిందితులతో దేవిరెడ్డికి గల సంబంధాలపై కూడా ఆరా తీస్తున్నారు అధికారులు.
ఇవి కూడా చదవండి...
ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు
ఏపీ రైతు బజార్లలో తక్కువ ధరకే బియ్యం.. కిలో రూ.49కే బీపీటీ సన్నాలు
Read Latest AP News And Telugu News