Share News

యూట్యూబర్‌ రమా నందనకు మరోసారి ఏపీ పోలీసుల నోటీసులు

ABN , Publish Date - Sep 12 , 2026 | 02:38 PM

యూట్యూబర్‌ రమా నందనకు ఏపీ పోలీసులు మరోసారి నోటీసులు అందజేశారు. లండన్‌లో ఉద్యోగం ఇప్పిస్తానంటూ రూ.10.50 లక్షలు మోసం చేశారని రమా నందనపై బాధితులు ఫిర్యాదు చేశారు.

 యూట్యూబర్‌ రమా నందనకు మరోసారి ఏపీ పోలీసుల నోటీసులు
YouTuber Rama Nandana

అమరావతి, సెప్టెంబర్ 12 (ఆంధ్రజ్యోతి): యూట్యూబర్‌ రమా నందనకు (YouTuber Rama Nandana) ఏపీ పోలీసులు మరోసారి నోటీసులు అందజేశారు. లండన్‌లో ఉద్యోగం ఇప్పిస్తానంటూ రూ.10.50 లక్షలు మోసం చేశారని రమా నందనపై పలువురు బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు జులై 4వ తేదీన అద్దంకి పోలీస్‌ స్టేషన్‌లో రమా నందనపై కేసు నమోదు చేశారు.


ఉద్యోగం ఏర్పాటు చేయకపోవడంతో పాటు, తీసుకున్న నగదును తిరిగి ఇవ్వలేదని బాధితులు ఆరోపించారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సెప్టెంబర్‌ 17వ తేదీన అద్దంకి పోలీస్‌ స్టేషన్‌లో విచారణకు హాజరుకావాలని రమా నందనను పోలీసులు ఆదేశించారు. ఈ కేసులో ఆమె వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేయనున్నారు. రమా నందనపై పోలీసుల తదుపరి చర్యలపై ఉత్కంఠ నెలకొంది.


ఈ వార్తలు కూడా చదవండి..

2027 నాటికి వందశాతం అక్షరాస్యతే లక్ష్యం.. కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

ఏపీ 2026-27 ఎక్సైజ్ పాలసీని ప్రకటించిన ఏపీ సర్కార్.. మద్యం షాపులపై కీలక నిర్ణయాలు

గణేశ్ మండపాలకు 9 రోజుల ఉచిత విద్యుత్: మంత్రి గొట్టిపాటి

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Sep 12 , 2026 | 03:14 PM