Share News

గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్.. మంత్రి నారా లోకేశ్ ప్రకటన

ABN , Publish Date - Sep 09 , 2026 | 11:18 AM

వినాయక చవితి పండుగ వేళ ఏపీ ప్రభుత్వం భక్తులకు గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసే వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ అందించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేశ్ ‘ఎక్స్‌’ వేదికగా ప్రకటించారు. పండుగను ఘనంగా, విజయవంతంగా నిర్వహించుకునేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు..

గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్.. మంత్రి నారా లోకేశ్ ప్రకటన
Ganesh Chaturthi Andhra Pradesh

అమరావతి, సెప్టెంబర్ 9: వినాయక చవితి పండుగను పురస్కరించుకుని ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్ అందించాలని నిర్ణయించినట్లు మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్‌’ వేదికగా ప్రకటించారు. పండుగను భక్తిశ్రద్ధలతో.. విజయవంతంగా నిర్వహించుకునేందుకు ప్రభుత్వం తరఫున మండపాలకు ఉచిత విద్యుత్ సరఫరా చేయనున్నట్లు తెలిపారు.


రాష్ట్రంలో వివిధ సమూహాలు నిర్వహించే వినాయక చవితి వేడుకలు విజయవంతంగా జరగాలని కోరుకుంటున్నట్లు నారా లోకేశ్ తెలిపారు. విఘ్నేశ్వరుడు రాష్ట్ర ప్రజలందరిపై తన ఆశీస్సులు కురిపించాలని ఆకాంక్షించారు. పండుగను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం తరఫున అవసరమైన సహకారం అందించడంలో భాగంగానే పందిళ్లకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో వినాయక మండపాల నిర్వాహకులకు విద్యుత్ ఖర్చుల భారం కొంత మేర తగ్గనుంది.


ఇవి కూడా చదవండి:

20 ఏళ్ల కార్పొరేట్ జీవితంలో పది క్రేజీ థింగ్స్.. వీడియో వైరల్

ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్.. డెలివరీ లేటైందని వెళ్లి చూస్తే..

Updated Date - Sep 09 , 2026 | 11:31 AM