Share News

కొత్త రాజకీయ పార్టీ అజెండాపై విజయ సాయిరెడ్డి ఏమన్నారంటే..

ABN , Publish Date - Sep 07 , 2026 | 01:26 PM

తాను ఏర్పాటు చేయబోయే నూతన రాజకీయ పార్టీ జెండా, అజెండా ప్రకటించే ముందు ప్రజలకు సంబంధించిన అంశాలను వివరిస్తానని మాజీ ఎంపీ విజయ సాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ఏపీలో మూడవ ప్రత్యమ్నాయం అవసరాన్ని ప్రజలకు వివరిస్తానని పేర్కొన్నారు.

కొత్త రాజకీయ పార్టీ అజెండాపై విజయ సాయిరెడ్డి ఏమన్నారంటే..
Vijayasai Reddy

విజయవాడ, సెప్టెంబర్ 7 (ఆంధ్రజ్యోతి): తాను ఏర్పాటు చేయబోయే నూతన రాజకీయ పార్టీ జెండా, అజెండా ప్రకటించే ముందు ప్రజలకు సంబంధించిన అంశాలను వివరిస్తానని మాజీ ఎంపీ విజయ సాయిరెడ్డి (Vijayasai Reddy) వ్యాఖ్యానించారు. ఏపీలో మూడవ ప్రత్యమ్నాయం అవసరాన్ని ప్రజలకు వివరిస్తానని పేర్కొన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, వైసీపీ, జనసేన పార్టీలు ప్రధానంగా ఉన్నాయని ప్రస్తావించారు. ఈ పార్టీలన్నీ ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి లేదని తెలిపారు. విజయవాడలో ఈరోజు (సోమవారం) విజయసాయిరెడ్డి పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.


ఆ మూడు పార్టీల్లో ఆ పరిస్థితి లేదు..

ప్రజల సమస్యల ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే పరిస్థితి ఆ మూడు పార్టీల్లో లేదని విజయ సాయిరెడ్డి చెప్పుకొచ్చారు. రాష్ట్ర రాజకీయం రెండు పార్టీల చుట్టురానే తిరుగుతున్నాయని అన్నారు. ఈ రెండు రాజకీయ పార్టీలు ఫ్యాక్షన్ పాలిటిక్స్ చేస్తున్నాయని విమర్శించారు. ప్రస్తుతం వైసీపీ, టీడీపీ పార్టీల మధ్య యుద్ధం జరుగుతోందని అన్నారు. పోలీసులు కూడా ఈ పార్టీలకు మద్దతిస్తున్నారని చెప్పారు. అందుకే మూడో ప్రత్యామ్నాయం అవసరం ఉందని తెలిపారు.


ఆ పార్టీలు ఫ్యాక్షన్ కుటుంబ రాజకీయ పార్టీలు..

ఏపీలోని ఆరు కోట్ల ప్రజానీకాన్ని, రాష్ట్ర సంపదను ఏ పార్టీ దోచుకోవాలనే హక్కు కోసం ఈ రెండు పార్టీలు కృషి చేస్తున్నాయని విజయ సాయిరెడ్డి విమర్శలు చేశారు. ఆ రెండు పార్టీలు ఫ్యాక్షన్ కుటుంబ రాజకీయ పార్టీలని విమర్శించారు. వీరిద్దరీ అజెండా ఒక్కటేనని ప్రజలకు గోరంత... తమకు కొండంత అనే విధంగా వ్యవహారిస్తాయని విజయ సాయిరెడ్డి విమర్శించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

టీడీపీ నాయకత్వానికి కొత్త దిశ.. చంద్రబాబు- లోకేశ్ సమక్షంలో లీడర్‌షిప్ కాంక్లేవ్

పవన్ కల్యాణ్ ప్రత్యేక చొరవ.. ఉప్పాడ తీర రక్షణకు కీలక చర్యలు

వంగవీటి రాధాను పాస్‌పోర్ట్‌ వ్యవహారంలో మోసం చేసేందుకు బ్రోకర్ యత్నం

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Sep 07 , 2026 | 01:50 PM