Share News

రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు సంచలనం.. 11 మందికి లీగల్ నోటీసులు

ABN , Publish Date - Apr 25 , 2026 | 05:32 PM

రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరావు పలువురికి శనివారం లీగల్ నోటీసులు పంపించారు. తనపై అక్రమ కేసులు పెట్టడం, తప్పుడు సమాచారం బ్లూ మీడియాకు ఇవ్వడంపై లీగల్ నోటీసులు అందజేశారు.

రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు సంచలనం.. 11 మందికి లీగల్ నోటీసులు
AB VenkateswaraRao

అమరావతి, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరావు (AB VenkateswaraRao) పలువురికి ఈరోజు (శనివారం) లీగల్ నోటీసులు పంపించారు. తనపై అక్రమ కేసులు పెట్టడం, తప్పుడు సమాచారం బ్లూ మీడియాకు ఇవ్వడంపై ఆయన లీగల్ నోటీసులు అందజేశారు. నోటీసులు పంపిన వారిలో అప్పటి డీజీపీ గౌతం సవాంగ్, ఇంటలిజెన్స్ బాస్ పీఎస్‌ఆర్ ఆంజనేయులు, అప్పటి ఏడీజీ రవిశంకర్ అయ్యనార్‌తో పాటు అప్పటి సీఎం జగన్ సీపీఆర్వో పూడి శ్రీహరికు లీగల్ నోటీసులు పంపించారు.


తనకు పరువునష్టం కలిగించడంతో పాటు, మానసిక వేదనకు గురి చేశారని నోటీసులో ఏబీ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. 11 మందికి డిఫర్‌మేషన్ నోటీసులను ఆయన పంపించారు. జగన్ హయాంలో కీలకంగా వ్యవహరించిన ఐపీఎస్ అధికారులు, సీపీఆర్వోకు ఏబీవీ నోటీసులు పంపించారు. రూ.కోటి నష్టపరిహారం చెల్లించాలంటూ ఈ నోటీసుల్లో ఏబీవీ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ఏపీలో కిల్లర్ పార్టీ దారుణాలకు తెగబడుతోంది.. సీఎం వార్నింగ్

బీటెక్ విద్యార్థులను సైబర్ క్రైమ్‌లోకి ముఠాలు లాగుతున్నాయి: రాయపాటి శైలజ

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Apr 25 , 2026 | 05:35 PM