Share News

కార్మికులే దేశ ప్రగతికి రథచక్రాలు: పవన్ కల్యాణ్

ABN , Publish Date - May 01 , 2026 | 10:55 AM

మేడే సందర్భంగా కార్మిక సోదరులందరికీ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రగతిని ముందుకు నడిపించే రథచక్రాలు కార్మికులని వ్యాఖ్యానించారు.

కార్మికులే దేశ ప్రగతికి రథచక్రాలు: పవన్ కల్యాణ్
Pawan Kalyan

అమరావతి, మే1 (ఆంధ్రజ్యోతి): మేడే సందర్భంగా కార్మిక సోదరులందరికీ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రగతిని ముందుకు నడిపించే రథచక్రాలు కార్మికులని వ్యాఖ్యానించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా డిప్యూటీ సీఎం పోస్టు చేశారు. అసంఘటిత రంగ కార్మికులు, ఉపాధి శ్రామికులు దేశ నిర్మాణంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు.


పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల్లో కార్మికులు కీలక పాత్ర పోషిస్తున్నారని డిప్యూటీ సీఎం తెలిపారు. MGNREGS ఉపాధి హామీ శ్రామికులకు గౌరవం కల్పించే దిశగా, ‘కూలీలు’ అనే పదాన్ని ‘శ్రామికులు’గా మార్పు చేశామని చెప్పుకొచ్చారు. వారి కుటుంబాలకు భరోసా కల్పించేలా పరిహార మొత్తాన్ని పెంచడం వంటి చర్యలను కూటమి ప్రభుత్వం చేపట్టిందని ప్రస్తావించారు. కార్మికులు, శ్రామికుల భద్రత, సంక్షేమం కోసం ఎల్లవేళలా కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి కార్మికునికి, శ్రామికునికి హృదయపూర్వక మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

టీమ్ ఏపీ కృషితోనే బిజినెస్ రిఫార్మర్ అవార్డు: సీఎం చంద్రబాబు

ఏపీలో పెట్టుబడులకు ముందుకొచ్చిన టైటాన్ సంస్థ

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 01 , 2026 | 11:39 AM