Home » May Day
సమాజాభివృద్ధిలో కీలకమైన కార్మికుల ఆరోగ్యం, సామాజిక భద్రతకు అండగా ఉంటామని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశమందిరంలో కార్మిక, ఉపాధిశిక్షణ, కర్మాగారాలశాఖ ఆధ్వర్యలో నిర్వహించిన మేడే వేడుకలకు కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
జిల్లాలో ప్రపంచ కార్మికుల దినోత్సవం శుక్రవారం ఆయా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జెండాలు ఎగురవేశారు. ఆసిఫాబాద్‌లో భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు బాలకిషన్, కమలాకర్ మేడే వేడుకలను ఘనంగా నిర్వహించి జెండాను ఆవిష్కరించారు.
మే డే సందర్భంగా కార్మికులకు మాజీ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఉత్పత్తి రంగంలో భాగమై దేశ సంపదను సృష్టిస్తున్న కార్మికుల రెక్కల కష్టం, వారి త్యాగాలు అమూల్యమైనవని కొనియాడారు.
మే డే సందర్భంగా కార్మికులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ ఆర్థిక పురోగతికి వెన్నెముక అయిన వ్యవసాయం ముందుకు వెళ్తుందంటే రైతులు, రైతు కూలీల శ్రమ శక్తే కారణమని అన్నారు.
ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.
మేడే సందర్భంగా కార్మిక సోదరులందరికీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. కార్మికుల కన్నీటి చుక్కలే నాగరికత చరిత్రకు సిరా అని అభివర్ణించారు.
మే డే సందర్భంగా కార్మిక సోదరులందరికీ ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. సమాజ ప్రగతిలో కార్మికులు ముఖ్యపాత్ర పోషిస్తున్నారని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు.
May Day wishes: మేడేను పురస్కరించుకుని కార్మికులకు సీఎం చంద్రబాబు, లోకేష్ విషెస్ తెలియజేశారు. కార్మిక వర్గం పక్షాన నిలబడి వారికి మేలు చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు.
మే 1.. కార్మికుల దినోత్సవం. హక్కుల సాధన కోసం కార్మికులు చేసిన పోరాటానికి గుర్తుగా మే డే నిలుస్తుంది. ప్రతి కార్మిక వాడల్లోనూ ఎంతో ఘనంగా వేడుకలు జరుపుకుంటారు. ఆయా రంగాల్లో పనిచేస్తున్న కార్మికులంతా ఎర్రజెండాలు చేతబూని వేడుకలు జరుపుకోవడం ఓ ఆనవాయితీ.
హైదరాబాద్: కార్మిక లోకానికి బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ (KCR) మేడే శుభాకాంక్షలు తెలిపారు. శ్రామికుల త్యాగాలకు ఘన నివాళులర్పించారు. శ్రామికుల రెక్కల కష్టం, వారి త్యాగం అనితరసాధ్యమన్నారు.