Share News

kumaram bheem asifabad- ఘనంగా ప్రపంచ కార్మిక దినోత్సవం

ABN , Publish Date - May 01 , 2026 | 10:32 PM

జిల్లాలో ప్రపంచ కార్మికుల దినోత్సవం శుక్రవారం ఆయా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జెండాలు ఎగురవేశారు. ఆసిఫాబాద్‌లో భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు బాలకిషన్‌, కమలాకర్‌ మేడే వేడుకలను ఘనంగా నిర్వహించి జెండాను ఆవిష్కరించారు.

kumaram bheem asifabad- ఘనంగా ప్రపంచ కార్మిక దినోత్సవం
ఆసిఫాబాద్‌లో జెండాను ఆవిష్కరిస్తున్న కార్మిక సంఘం నాయకులు

ఆసిపాబాద్‌, మే 1 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రపంచ కార్మికుల దినోత్సవం శుక్రవారం ఆయా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జెండాలు ఎగురవేశారు. ఆసిఫాబాద్‌లో భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు బాలకిషన్‌, కమలాకర్‌ మేడే వేడుకలను ఘనంగా నిర్వహించి జెండాను ఆవిష్కరించారు. ఆర్టీసీ డిపో ఆవరణలో ఏఐటీయూసీ, ఎంప్లాయిస్‌ యూనియన్‌, ఆర్టీసీ కార్మికులు మేడే వేడుకల్లో భాగంగా ఘనంగా నిర్వహించగా ఎంప్లాయిస్‌ యూనియన్‌ అధ్యక్షుడు అశోక్‌ జెండాను ఆవిష్కరించారు. సీఐటీయూ ఆధ్వర్యంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేందర్‌, పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి, ఆయా సంఘాల కార్యాలయాల ఎదుట జెండాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆయా కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.

కాగజ్‌నగర్‌, (ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్‌లో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ రాజీవ్‌ గాంధీ చౌరస్తా నుంచి ప్రారంభమై పట్టణ పలు వీధుల గుండా సాగింది. అనంతరం ఏర్పాటు చేసిన సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు త్రివేణి, ముంజం శ్రీనివాస్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చట్టాలను అవలంబిస్తోందన్నారు. లేబర్‌ కోడ్‌ విధానాలను వెంటనే రద్దు చేయాలన్నారు. ఈ చట్టం కేవలం పెత్తందారి వ్యవస్థలకు ఉపయోగం ఉందన్నారు. కార్మికులకు తీవ్రని అన్యాయం జరుగుతుందన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి లేబర్‌ కోడ్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండు చేశారు. అలాగే అన్నీ సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీలు, జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమాల్లో సీఐటీయూ నాయకులు ముంజం ఆనంద్‌, శంకర్‌, శ్రీనివాస్‌, ప్రవీణ్‌ కుమార్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు.

రెబ్బెన, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు పరిచిన లేబర్‌ కోడ్‌ విధానాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఎఐటీయూసీ మండల అధ్యక్షుడు రాచకొండ రమేష్‌, కార్యదర్శి రత్నం దేవాజీ, నాయకులు వెంకటేష్‌, సునీల్‌, శంకర్‌, ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు. సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఏఐటీయూసీ, సీపీఐ ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. గోలేటిలోని కెఎల్‌ మహేందర్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో బ్రాంచ్‌ కార్యదర్శి ఎస్‌.తిరుపతి మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు మారం శ్రీనివాస్‌, రాంకిషన్‌, నాదం రవి, శేషశైనారావు, ఆశోక్‌, బయ్య మొగిలి, రాజేష్‌, కిరణ్‌ బాబు పాల్గొన్నారు.

సిర్పూర్‌(యు)/ జైనూర్‌, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని గాంధీ చౌక్‌లో శుక్రవారం మేడే సందర్భంగా జెండాను కార్మిక నాయకులు ఆవిష్కరించారు. 140వ మేడే దినోత్సవంను గ్రామీణ పెదల సంఘం ఆధ్వర్యంలో కార్మికులు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భగా ఆ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కుటికల శంకర్‌, డీఎస్‌వో ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు సిడాం ధర్ము మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 29 కార్మిక చట్టాలతోపాటు 4 లేబర్‌ కోడ్‌లను ఉపసంహరించే వరకు పోరాటం కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో గేడం నాగోరావు, గణేశ్‌ మాణిక్‌రావు తదితరులు పాల్గొన్నారు.

వాంకిడి, (ఆంధ్రజ్యోతి): కార్మికుల హక్కుల సాధనకు ప్రతీకగా నిలిచిన మేడే వేడుకలను శుక్రవారం మండలంలో కార్మికులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా హమాలీ కార్మిక సంఘం, భవణ నిర్మాణ కార్మిక సంఘం కార్యాలయాల వద్ద ఆయా సంఘాల నాయకులు జెండా ఎగరవేశారు, ఈ సందర్భంగా కార్మిక అమరవీరులకు నివాళులు అర్పించారు. కార్మికుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం ఐక్యంగా పోరాడాలని పవురులు నాయకులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వాంకిడి సర్పంచ్‌ సతీష్‌, బీఎస్‌ఐ జిల్లా అధ్యక్షుడు మహోల్‌కార్‌ అశోక్‌, పీఏసీఎస్‌ మాజీ చైర్మన్‌ జాబిరే పెంటు, అంబేద్కర్‌ యువజన సంఘం నాయకులు దుర్గం సందీప్‌, విలాస్‌, దుర్గం ప్రశాంత్‌, సీపీఐ జిల్లా నాయకుడు గోపినాథ్‌, ప్రకాష్‌, సీపీఎం నాయకులు కార్తిక్‌, దినకర్‌, ఎల్‌ఎస్‌ఎస్‌ సంస్థ చైర్మన్‌ గాదే అవినాష్‌, గాదే అనిల్‌, కాంగ్రెస్‌ నాయకుడు సుధాకర్‌, హమాలీ సంఘం నాయకులు సదాశివ్‌, భీంరావు, నాగుల రవి, ఉప్పరి రాములు, బండు, కార్మికులు పాల్గొన్నారు.

Updated Date - May 01 , 2026 | 10:32 PM