‘మేడే’ షో చూసి.. 174 మంది ప్రాణాలు కాపాడిన రియల్ హీరో.!
ABN , Publish Date - Oct 01 , 2026 | 03:37 PM
విమాన ప్రమాదాలపై ప్రసారమయ్యే ఓ టీవీ షో.. ఓ ప్రయాణికుడికి నిజ జీవితంలో చక్కగా ఉపయోగపడింది. ఆ షోలో చూసిన సన్నివేశాలను గుర్తుచేసుకున్న ఆయన.. విమానాన్ని చాకచక్యంగా కంట్రోల్ చేశారు. అలా విమానం సేఫ్‌గా ల్యాండ్ కావడం సహా అందులోని ప్రయాణికులంతా ప్రాణాలతో బయటపడ్డారు.
ఇంటర్నెట్ డెస్క్: ‘మేడే’ అనేది ఓ ప్రముఖ టీవీ షో. విమాన ప్రమాదాలపై ఇంగ్లీష్‌లో చక్కగా అవగాహన కల్పిస్తుంటుందీ టెలివిజన్ సిరీస్. ఈ షోలో చూసిన కొన్ని స్కిట్‌లే ఓ ప్యాసింజర్‌కు రియల్ లైఫ్‌లో ఉపయోగపడ్డాయి. ఇందులో చూపిన ట్రిక్స్‌ను ఫాలో అయి.. ఫ్లైదుబాయ్ విమానంలో నిన్న(బుధవారం) జరిగిన అత్యవసర పరిస్థితుల్లో 174 మంది ప్రయాణికులు సహా సిబ్బంది ప్రాణాలను రక్షించిన ఆ హీరోనే ఇజ్రాయెల్‌కు చెందిన యానివ్ హయూన్. ఇంతకీ ఆ సమయంలో ఆయన ఏం చేశారు? ‘మేడే’ షో ఎలా సహకరించింది.? అనే వివరాల్లోకెళితే...
సెప్టెంబర్ 30న జరిగిన ఫ్లైదుబాయ్ విమానం ఒక్కసారిగా సుమారు 14 వేల అడుగుల మేర కిందకు దిగింది. ఇదే సమయంలో కాక్‌పిట్‌లో తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. గాయపడిన పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్ కాక్‌పిట్ డోర్ తీయడంతో.. యానివ్ లోపలికి ప్రవేశించారు. విమానం వంగిపోతుండటాన్ని గమనించి.. వెంటనే కంట్రోల్ యోక్‌ను పట్టుకుని వెనక్కి లాగారు. ‘ఇలా ఎలా చేయాలో మీకు తెలుసా?’ అని అడగ్గా.. అప్పుడు యానివ్ చెప్పిన సమాధానం అందరినీ ఆశ్చర్యపరిచింది. ‘నేను మేడే చూస్తాను’ అని చెప్పారు. విమాన ప్రమాదాలు, ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్‌లను వివరించే ఆ సిరీస్‌లో చూసిన దృశ్యాలే ఆ సమయంలో తనకు ఉపయోగపడ్డాయన్నారు.
‘మేడే’ విషయానికొస్తే..
‘మేడే’ సిరీస్ 2003లో ప్రారంభమైంది. దీనిని టొరంటో(కెనడా)కు చెందిన సినీ ఫ్లిక్స్ ప్రొడక్షన్స్ రూపొందించింది. నేషనల్ జియోగ్రాఫిక్‌లో ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమం ‘ఎయిర్ క్రాష్ ఇన్వెస్టిగేషన్’ పేరిట ప్రసారవుతుండగా.. అమెరికాలో ‘ఎయిర్ డిజాస్టర్స్’, ‘ఎయిర్ ఎమర్జెన్సీ’ పేర్లతో టెలికాస్ట్ అవుతోంది. చారిత్రక విమాన ప్రమాదాలు, దానికి దారితీసిన కారణాలు, పైలట్లు తీసుకునే నిర్ణయాలు, అధికారిక విమాన డేటా రికార్డింగ్స్, ప్రత్యక్ష సాక్షుల వివరాలు, సీజీఐ(కంప్యూటర్ జనరేటెడ్ ఇమేజరీ) పునర్నిర్మాణాలను ఈ సిరీస్ వివరిస్తుంది. రెండు దశాబ్దాలకు పైగా ప్రసారమవుతున్న ఈ షో.. ఈసారి నిజ జీవితంలో ప్రాణరక్షణకు ఉపయోగపడింది. టీవీలో చూసిన విషయాలను గుర్తుచేసుకున్న యానివ్.. కీలక సమయంలో విమానాన్ని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించడం విశేషం.
ఇవీ చదవండి:
కాక్‌పిట్‌లో దాడితో తీవ్రంగా గాయపడిన కెప్టెన్ స్మిత్.. అత్యవసర చికిత్స చేసిన డెంటిస్ట్
ఫ్లైదుబాయ్ విమాన ఘటన.. ప్రయాణికుడికి నెతన్యాహు ప్రశంసలు