Share News

ఫ్లైదుబాయ్ విమాన ఘటన.. ప్రయాణికుడికి నెతన్యాహు ప్రశంసలు

ABN , Publish Date - Oct 01 , 2026 | 10:32 AM

ఫ్లైదుబాయ్ విమానంలో భారతీయ పైలట్ స్మిత్ మచ్చార్‌ను కత్తితో పొడిచిన కోపైలట్‌ను నిలువరించిన ప్రయాణికుడు యానివ్‌ హయూన్‌ను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రశంసించారు.

ఫ్లైదుబాయ్ విమాన ఘటన.. ప్రయాణికుడికి నెతన్యాహు ప్రశంసలు

ఇంటర్‌నెట్ డెస్క్: ఫ్లైదుబాయ్ విమానంలో భారతీయ పైలట్ స్మిత్ మచ్చార్‌ను కత్తితో పొడిచిన కోపైలట్‌ను నిలువరించిన ప్రయాణికుడు యానివ్‌ హయూన్‌ను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రశంసించారు. ‘నీవు గ్రేట్ హీరోవి. నీవు సింహానివి. నిన్ను చూస్తుంటే సింహాన్ని చూస్తున్నట్లు ఉంది. అంతర్జాతీయ గుర్తింపుకు నీవు అర్హుడివి. నీవు అద్భుతమైన పని చేశావు. విమానంలో ఉన్న ప్రయాణికులను మాత్రమే కాదు.. చాలా మంది ప్రాణాలను నువ్వు కాపాడావు. నువ్వు హీరోవి’ అని నెతన్యాహు కొనియాడారు. తర్వాత ఆయన ఈ మేరకు ట్వీట్ చేశారు.


కాగా.. ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ విమానాశ్రయంలో బుధవారం నెతన్యాహును యానివ్ కలిశారు. దుండగుడితో పోరాడుతుండగా ఆయన కూడా గాయపడ్డారు. ఆయన టీషర్ట్‌కు రక్తపు మరకలు అంటుకున్నాయి. ఆ మరకలు ఉన్న టీషర్టును ధరించే నెతన్యాహును యానివ్ కలిశారు. భారతీయ పైలట్ మచ్చార్‌పై దుండగుడు దాడిచేసి కాక్‌పిట్ డోర్‌కు నొక్కిపెట్టాడని ఆయన తెలిపారు. దీంతో కాక్‌పిట్‌లోకి ప్రవేశించడం తనతోపాటు తన తోటి ప్రయాణికులకూ కాస్త కష్టంగా మారిందన్నారు.


అయినప్పటికీ డోర్‌ను బద్దలుకొట్టి లోపలికి ప్రవేశించానని ఆయన వివరించారు. ‘నేను లోపలికి ప్రవేశించాక విమానాన్ని క్రాష్ చేసేందుకు దుండగుడు యత్నించాడు. దీంతో విమానం తలకిందులుగా ప్రయాణించింది. ఇదంతా కొన్ని సెకన్లలోపే జరిగిందని చెప్పారు. వెంటనే టెర్రరిస్టును పట్టుకొని లాగిపారేశాను. మళ్లీ అతడిని నా స్వాధీనంలోకి తీసుకొని ఊపిరి ఆగకుండా చేశాను’ అని యానివ్ వివరించారు.


యానివ్ అద్భుత జవాబు

టెర్రరిస్టును ఎలా పట్టుకున్నావని యానివ్‌ను ప్రధాని నెతన్యాహు ప్రశ్నించగా.. ఆయన ఇచ్చిన సమాధానికి ప్రధాని ఆశ్చర్యపోయారు. తాను ఎయిర్ క్రాష్ ఇన్వెస్టిగేషన్ షో చూస్తానని, దాంతో టెర్రరిస్టును పట్టుకునేందుకు ఆ టీవీషో సాయం చేసిందన్నారు. ఆ సమాధానంతో ప్రధాని ఆశ్చర్యపోయారు.


ఈ వార్తలు కూడా చదవండి

ఇంధన నౌక హైజాక్‌

రష్యాపై ఉక్రెయిన్‌ ‘జాంబీ కార్ల’ యుద్ధం

మరిన్ని నేషనల్, ఇంటర్నేషనల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Oct 01 , 2026 | 11:38 AM