సంపదను సృష్టిస్తున్న కార్మికుల కష్టం, త్యాగాలు అమూల్యమైనవి: కేసీఆర్
ABN , Publish Date - May 01 , 2026 | 09:23 AM
మే డే సందర్భంగా కార్మికులకు మాజీ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఉత్పత్తి రంగంలో భాగమై దేశ సంపదను సృష్టిస్తున్న కార్మికుల రెక్కల కష్టం, వారి త్యాగాలు అమూల్యమైనవని కొనియాడారు.
హైదరాబాద్, మే 1: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మే డే) సందర్భంగా కార్మిక కర్షక లోకానికి బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఉత్పత్తి రంగంలో భాగమై దేశ సంపదను సృష్టిస్తున్న కార్మికుల రెక్కల కష్టం, వారి త్యాగాలు అమూల్యమైనవని కొనియాడారు. చారిత్రాత్మక మే డే స్ఫూర్తితో గత బీఆర్ఎస్ ప్రభుత్వం.. సబ్బండ కులాల కర్షక కార్మికుల సంక్షేమం కోసం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను, ఆదర్శవంతమైన పారిశ్రామిక విధానాలను అమలు చేసిందని చెప్పారు.
సింగరేణి, ఆర్టీసీ, భవన నిర్మాణ రంగం సహా పలు రంగాలకు చెందిన కార్మికులు, ఆటో డ్రైవర్లు, దినసరి కూలీలు, అసంఘటిత రంగ కార్మికుల కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను మాజీ సీఎం గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వినూత్న పారిశ్రామిక విధానాల ద్వారా తెలంగాణలో సంపద సృష్టించడంతో లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు లభించాయని అన్నారు. నాటి పదేళ్ల ప్రగతి కార్యాచరణను మరింత పటిష్ఠంగా అమలుచేయడమే రాష్ట్ర కార్మిక లోకానికి మనమిచ్చే గొప్ప కానుక అని కేసీఆర్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి...
జాసన్ హోల్డర్ క్యాచ్ వివాదం.. అంపైర్‌పై కోహ్లీ ఆగ్రహం!
Read Latest Telangana News And Telugu News