Share News

సాగరమాల ద్వారా మత్స్యకారులకు న్యాయం: మంత్రి అచ్చెన్నాయుడు

ABN , Publish Date - Feb 13 , 2026 | 03:29 PM

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో మూడోరోజు ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. పెందుర్తి నియోజకవర్గంలో మినీ జెట్టి నిర్మాణంపై పంచకర్ల రమేశ్ బాబు ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు సమాధానం ఇచ్చారు.

సాగరమాల ద్వారా మత్స్యకారులకు న్యాయం: మంత్రి అచ్చెన్నాయుడు
Minister Kinjarapu Atchannaidu

అమరావతి, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో మూడోరోజు ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగుతోంది. పెందుర్తి నియోజకవర్గంలో మినీ జెట్టి నిర్మాణంపై పంచకర్ల రమేశ్ బాబు ప్రశ్నించారు. ఆయన అడిగిన ప్రశ్నకు ఏపీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు (Minister Kinjarapu Atchannaidu) సమాధానం ఇచ్చారు. జువలదిన్నె, మచిలీపట్నం వంటి ఫిషింగ్ హర్బర్‌ల నిర్మాణాలు తుది దశలో ఉన్నాయని వివరించారు. పనులు లేని సమయంలో రూ.10 వేల నుంచి రూ.20 వేలకు పెంచి పని కల్పించామన్నారు. విశాఖపట్నం హర్బర్ చాలా దారణంగా తయారైందని అన్నారు. విశాఖపట్నం పోర్టు అథారిటీ ఆధ్వర్యంలో అధునాతన పనులు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. సాగరమాల కార్యకమ్రం ద్వారా మత్స్యకారులను న్యాయం చేస్తామన్నారు. కాకినాడ ఫిషింగ్ హర్బర్‌ను మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. ముత్యాలమ్మపాలెం జెట్టి నిర్మాణానికి సరైనదని ప్రభుత్వం రిపోర్టు కూడా ఇచ్చిందని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.


వితంతు పెన్షన్లపై త్వరలో నిర్ణయం: మంత్రి శ్రీనివాస్

Minister-Kondapalli-Sriniva.jpg

అలాగే.. పెన్షన్లకు సంబంధించి అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా.. ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు పలు ప్రశ్నలు సంధించారు. 2024 తర్వాత పలువురికి వితంతు పెన్షన్లు రావడం లేదని ప్రశ్నించారు. ధర్మరాజు అడిగిన ప్రశ్నకు ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్(Minister Kondapalli Srinivas) జవాబిచ్చారు. త్వరలోనే వితంతు పెన్షన్‌లు ఇవ్వడంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పుకొచ్చారు. ఇప్పటికే ఈ పెన్షన్లకు సంబంధించి సీఎం చంద్రబాబుతో చర్చించామని, త్వరలో నిర్ణయం తీసుకుంటామని మంత్రి శ్రీనివాస్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ హయాంలో మద్యనిషేధం పేరుతో రేట్లు పెంచారు: మంత్రి కొల్లు రవీంద్ర

ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానం, చర్చలు

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 13 , 2026 | 04:21 PM