Share News

ఆర్నబ్ తుఫాన్ ప్రభావం.. 29న ఏపీలోని ఆ జిల్లాల విద్యాసంస్థలకు సెలవులు

ABN , Publish Date - Oct 28 , 2026 | 08:50 PM

ఆర్నబ్ తుఫాన్ ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముందస్తు జాగ్రత్తగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఆర్నబ్ తుఫాన్ ప్రభావం.. 29న ఏపీలోని ఆ జిల్లాల విద్యాసంస్థలకు సెలవులు
AP School Holiday News

అమరావతి, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): ఆర్నబ్ తుఫాన్ ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముందస్తు జాగ్రత్తగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలోని విశాఖపట్నం, రాజమహేంద్రవరం, ఏలూరు జిల్లాల్లోని విద్యాసంస్థలకు సెలవులను ప్రకటించింది.


రాజమహేంద్రవరంలో..

రేపు (గురువారం) రాజమహేంద్రవరంలోని విద్యాసంస్థలకు, అంగన్వాడీ కేంద్రాలకు ఏపీ సర్కార్ సెలవు ప్రకటించింది. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలలకు సెలవులు ప్రకటించింది.


విశాఖపట్నంలో..

ఆర్నబ్ తుఫాన్ ప్రభావం ఇంకా కొనసాగుతున్నందున విశాఖపట్నంలో రేపు (గురువారం) కూడా జిల్లాలో అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వ, ప్రైవేటు, కళాశాలలకు, అంగన్‌వాడీలకు కలెక్టర్. M. అభిషిక్త్ కిషోర్ సెలవు ప్రకటించారు. అలాగే, బుధవారం రాత్రి 9.00 గంటల నుంచి గురువారం ఉదయం 8.00 గంటల వరకు విశాఖపట్నం జిల్లాలోని నగర పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ తెలిపారు.


ఏలూరు జిల్లాలో...

ఏలూరు జిల్లాలో వర్షాల కారణంగా అన్ని మేనేజ్‌మెంట్ పాఠశాలలు, కళాశాలలకు రేపు(గురువారం) కలెక్టర్ వెట్రిసెల్వి సెలవు ప్రకటించారు. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించాలని పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆర్నబ్ తుఫాన్ పునరావాస శిబిరాల్లో ఆహారం, తాగునీరు సిద్ధం చేయండి: సీఎం చంద్రబాబు

స్థానిక ఎన్నికల్లో కూటమి ధర్మం పాటించాల్సిందే.. శ్రేణులకు చంద్రబాబు, పవన్, మాధవ్ దిశానిర్దేశం

ఆర్న‌బ్ తుఫాన్‌ ప్రభావం.. ఏపీ ప్రభుత్వం స‌ర్వ‌త్రా అప్ర‌మ‌త్తం

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Oct 28 , 2026 | 09:47 PM