కాంగ్రెస్ ఏపీ వ్యవహారాల ఇన్‌చార్జిగా పి.వి. మోహన్ నియామకం.. ఆదేశాలు జారీ
ABN , Publish Date - Sep 05 , 2026 | 09:42 PM
కాంగ్రెస్ ఏపీ వ్యవహారాల ఇన్‌చార్జిగా పి.వి. మోహన్ నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆదేశాలు జారీ చేశారు.
అమరావతి, సెప్టెంబరు 5: కాంగ్రెస్ ఏపీ వ్యవహారాల ఇంచార్జిగా పి.వి మోహన్ నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆదేశాలు జారీ చేశారు. కాంగ్రెస్ ఏపీ వ్యవహారాల ఇన్‌చార్జిగా ప్రస్తుతం బాధ్యతలు నిర్వర్తిస్తున్న మాణిక్యం ఠాగూర్ స్థానంలో పి.వి. మోహన్‌ను నియమిస్తూ కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది.
ఇప్పటివరకు ఏపీ ఇన్‌చార్జిగా పనిచేసిన మాణిక్యం సేవలను అధిష్ఠానం కొనియాడింది. అంతేకాకుండా, కాంగ్రెస్ హై కమాండ్ ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ నూతన ఇన్‌చార్జ్‌లను, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం చంద్రబాబు అధ్యక్షతన రెండు రోజుల పాటు కలెక్టర్ల కాన్ఫరెన్స్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చొరవతో పల్లె చెరువులకు కొత్త కళ
జాతీయ స్థాయిలో పోలీస్ గేమ్స్‌లో ఏపీకి మంచి పేరు తీసుకురావాలి: డీజీపీ
Read Latest Telangana News And AP News And National News
And Telugu News