Share News

పల్లెల్లో పరిశ్రమలు

ABN , Publish Date - Aug 13 , 2026 | 07:18 AM

రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేలా పారిశ్రామిక సంస్థలకు ఇచ్చే ప్రోత్సాహకాలను ఈ ఏడాది డిసెంబరు నుంచి ఎస్ర్కో ఖాతాలో జమ చేయాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.

పల్లెల్లో పరిశ్రమలు

  • గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందేలా ప్రాజెక్టులు ఏర్పాటవ్వాలి

  • ఎస్క్రో ఖాతాలో ప్రోత్సాహకాలు

  • ప్రాజెక్టులపై ప్రజలకు అవగాహన కల్పించాలి

  • ఉత్తరాంధ్ర డేటా సెంటర్లకు 3.5 టీఎంసీలు చాలు

  • డిసెంబరులో మూలపేట పోర్టు ప్రారంభించాలి

  • రాష్ట్రంలోని డిఫెన్స్‌ ప్రాజెక్టులు జాతికి గర్వకారణం

  • గ్రీన్‌ అమ్మోనియా, లిథియం బ్యాటరీలు,

  • రోబోటిక్స్‌ రంగాలపై దృష్టి

  • ఎస్‌ఐపీబీ సమావేశంలో సీఎం దిశా నిర్దేశం

  • 2.08 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం

  • ప్రాజెక్టుల ద్వారా 21,637 మందికి ఉద్యోగాలు

అమరావతి, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేలా పారిశ్రామిక సంస్థలకు ఇచ్చే ప్రోత్సాహకాలను ఈ ఏడాది డిసెంబరు నుంచి ఎస్ర్కో ఖాతాలో జమ చేయాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందేందుకు ఆయా ప్రాంతాల్లో పారిశ్రామిక ప్రాజెక్టులను ఏర్పాటు చేసేలా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. సచివాలయంలో బుధవారం సీఎం అధ్యక్షతన 20వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రూ. 2,08,406 కోట్ల పెట్టుబడుల ద్వారా 21,637 మందికి ఉద్యోగాలను కల్పించే పారిశ్రామిక, వాణిజ్య ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేశారు.


ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, పరిశ్రమలకు ప్రోత్సాహకాలివ్వడం తప్పనిసరి అయినా.. అవి ఎంతవరకూ అవసరమో కూడా సమీక్షించాలని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటవుతున్న పారిశ్రామిక ప్రాజెక్టులను ప్రజలకు వివరించి, వారికి అవగాహన కల్పించాలని చెప్పారు. డేటా సెంటర్లపై అపోహలను తొలగించే చర్యలు చేపట్టాలన్నారు. ఉత్తరాంధ్రలో ఏర్పాటవుతున్న డేటా సెంటర్లన్నింటికీ 3.5 టీఎంసీలు నీరు సరిపోతుందన్నారు. పోలవరం ఎడమ కాలువ నుంచి గ్రావిటీ ద్వారా పరిశ్రమలకు గోదావరి జలాలు అందిస్తామని చెప్పారు. పర్యాటకులను ఆకట్టుకునేలా హోటల్‌ భవనాలు ప్రత్యేక నిర్మాణ శైలి ఉండేట్టు చూడాలన్నారు.


వచ్చే నెలలో 175 ఎంఎ్‌సఎంఈ పార్కులు

రాష్ట్రంలో ఏర్పాటవుతున్న రక్షణరంగ ప్రాజెక్టులన్నీ జాతికి గర్వకారణమని చంద్రబాబు పేర్కొన్నారు. పుట్టపర్తి సమీపంలో డిఫెన్స్‌, హిందూపూర్‌ సమీపంలో ఏరోస్పేస్‌ ప్రాజెక్టులు రావాలని అధికారులకు చెప్పారు. గ్రీన్‌ అమ్మోనియా, లిథియం బ్యాటరీలు, రోబోటిక్స్‌ వంటి ఆధునిక రంగాలపై దృష్టి పెట్టాలన్నారు. మూలపేట పోర్టు డిసెంబరులో ప్రారంభించేలా చూడాలన్నారు. రాష్ట్రంలో లాజిస్టిక్స్‌, ఆధునిక వేర్‌హౌసింగ్‌, కోల్డ్‌ చైన్‌ ప్రాజెక్టులను అనుసంధానించాలని చెప్పారు. రాయలసీమ ఉద్యాన ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు చేర్చేందుకు రోడ్‌, రైల్‌, పోర్టు, ఎయిర్‌పోర్టు కనెక్టివిటీని అభివృద్ధి చేయాలని చెప్పారు.


పెట్టుబడి ఒప్పందాలు, ఎస్‌ఐపీబీలో అనుమతి పొందిన ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఈ ఏడాది సెప్టెంబరు కల్లా 175 నియోజకవర్గాల్లో పారిశ్రామిక పార్కులు అందుబాటులోకి రావాలన్నారు. వన్‌ఫ్యామిలీ-వన్‌ఎంటర్‌ప్రెన్యూర్‌ కార్యక్రమాన్ని కూడా పెద్దఎత్తున చేపట్టాలని సీఎం చెప్పారు. కాగా, పరిశ్రమలు, ఇంధనం, ఐటీ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, లిథియం బ్యాటరీలు, గ్రీన్‌ అమ్మోనియా రంగాల్లో మొత్తం 25 ప్రాజెక్టుల ప్రతిపాదనలకు ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది. కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు 363 ప్రతిపాదనల ద్వారా రూ. 13.79 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. వీటితో 10.86 లక్షల మందికి ఉద్యోగాలు దక్కనున్నాయి.


ఎస్‌ఐపీబీలో ఆమోదం పొందిన ప్రాజెక్టులు ఇవీ..

  • ఓకెయిర్‌ గ్రీన్‌ ఫ్యూయెల్స్‌.. కర్నూలు జిల్లాలో రూ. 616 కోట్ల పెట్టుబడితో 130 మందికి ఉద్యోగాలు

  • జాక్స్‌సగ్రీన్‌ రెన్యూవబుల్‌.. కర్నూలు జిల్లాలో రూ. 1,533 కోట్ల పెట్టుబడితో 250 మందికి ఉద్యోగాలు

  • ఎఫ్‌సీఈఎల్‌ రవ్వేద పవర్‌.. విజయనగరం జిల్లాలో రూ. 480 కోట్ల పెట్టుబడితో 1,500 మందికి ఉద్యోగాలు

  • వారీ క్లీన్‌ ఎనర్జీ.. కాకినాడలో రూ. 15,000 కోట్ల పెట్టుబడితో 1,500 మందికి ఉద్యోగాలు

  • ఆరాధ్యా బయోగ్యాస్‌.. కర్నూలు జిల్లాలో రూ. 143.47 కోట్ల పెట్టుబడి, 595 మందికి ఉద్యోగాలు

  • ఉషోదయా బయోగ్యాస్‌.. నెల్లూరులో 143.47 కోట్ల పెట్టుబడి, 595 మందికి ఉద్యోగాలు

  • డేటా సెంటర్‌హోల్డింగ్స్‌ ఇండియా.. విశాఖపట్నంలో రూ. 58,743 కోట్ల పెట్టుబడి, 1,250 మందికి ఉద్యోగాలు


  • మునోథ్‌ లిథియం బ్యాటరీ లిమిటెడ్‌.. తిరుపతి జిల్లాలో రూ. 500 కోట్ల పెట్టుబడితో 240 మందికి ఉద్యోగాలు

  • ఏఐఎల్‌ డిక్సన్‌ ఇండియా లిమిటెడ్‌.. తిరుపతిలో రూ. 450 కోట్ల పెట్టుబడి, 7,000 మందికి ఉద్యోగాలు

  • రెన్యూ ఏపీ గ్రీన్‌ డేటాసెంటర్‌, అనకాపల్లి రూ. 85,200 కోట్ల పెట్టుబడి, 1,000 మందికి ఉద్యోగాలు

  • సీఆర్‌ఆర్‌ హాస్పిటాలిటీ.. తిరుపతిలో రూ.192 కోట్ల పెట్టుబడి 200 మందికి ఉద్యోగాలు

  • ఏఎం ఇంటెలిజెన్స్‌ ల్యాబ్స్‌.. విశాఖ జిల్లాలో 31,387 కోట్లు, 1,000 ఉద్యోగాలు

  • ఆర్కే 2 ఇన్‌ఫ్రా.. తిరుపతిలో రూ. 150 కోట్ల పెట్టుబడి, 150 మందికి ఉద్యోగాలు

  • సన్‌రైజ్‌ హోటల్‌ ఇండియా.. కాకినాడలో రూ. 54 కోట్ల పెట్టుబడి, 75 మందికి ఉద్యోగాలు

  • జెఎస్పీ హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌.. కృష్ణా జిల్లాలో రూ. 64 కోట్ల పెట్టుబడి, 100 మందికి ఉద్యోగాలు


  • పావులూరి హోటల్స్‌.. తిరుపతిలో రూ. 59 కోట్ల పెట్టుబడి, 150 మందికి ఉద్యోగాలు

  • అగస్త్యా గ్రీన్‌ ఎనర్జీ.. కర్నూలులో రూ. 7,799 కోట్ల పెట్టుబడి, 1,000 మందికి ఉద్యోగాలు

  • అక్షత్‌ గ్రీన్‌టెక్‌.. విశాఖపట్నంలో రూ. 1,600 కోట్ల పెట్టుబడి, 750 మందికి ఉద్యోగాలు

  • కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌.. శ్రీకాకుళం జిల్లా మూలపేటలో రూ. 2,125 కోట్ల పెట్టుబడి, 400 మందికి ఉద్యోగాలు

  • హిందాల్కో ఇండస్ట్రీస్‌.. చిత్తూరు జిల్లా కుప్పంలో రూ. 880 కోట్ల పెట్టుబడి, 447 మందికి ఉద్యోగాలు

  • ఎస్ట్రేలా లాజిస్టిక్స్‌.. విశాఖపట్నంలో రూ. 90 కోట్ల పెట్టుబడి, 100 మందికి ఉద్యోగాలు

  • గణేష్‌ సాయి మౌనిష్‌ స్టీల్స్‌.. విజయనగరంలో రూ. 66 కోట్ల పెట్టుబడి, 120 మందికి ఉద్యోగాలు

  • వీపీఆర్‌ మైనింగ్‌ ఇన్‌ఫ్రా.. నెల్లూరు జిల్లా మనుబోలులో రూ. 500 కోట్ల పెట్టుబడులు, 2,000 మందికి ఉద్యోగాలు

  • జయాదిత్యా ఆగ్రో లిమిటెడ్‌.. కర్నూలు జిల్లాలో రూ. 300 కోట్ల పెట్టుబడులు, 350 మందికి ఉద్యోగాలు

  • ప్రిసాల్‌ ఆగ్రో ఇండస్ట్రిస్‌.. నెల్లూరు జిల్లాలో రూ. 330.71 కోట్ల పెట్టుబడి, 1,110 మందికి ఉద్యోగాలు


వార్తలు కూడా చదవండి...

చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కఠినంగా వ్యవహరించాలి: సీఎం చంద్రబాబు

అమరావతి అభివృద్ధిలో మరో ముందడుగు.. సీడ్ యాక్సిస్ రోడ్డు, రెండు స్టీల్ బ్రిడ్జిల ప్రారంభం

నటి కాదంబరీ జెత్వానీ కేసులో కీలక పరిణామం

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Aug 13 , 2026 | 07:23 AM