Share News

తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Sep 14 , 2026 | 03:56 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమలలో కొలువుదీరిన కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.

తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు

అమరావతి, సెప్టెంబర్14: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమలలో కొలువుదీరిన కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. అందుకోసం సెప్టెంబర్15వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరతారు. సాయంత్రం 5.30 గంటలకు తిరుపతిలోని ఎస్వీ అగ్రికల్చర్ కళాశాల గ్రౌండ్‌కు చేరుకుంటారు. రాత్రి 7.40 గంటలకు శ్రీవారి దేవాలయం ఆనంద నిలయం ఎదురుగా ఉన్న బేడీ ఆంజనేయస్వామి వారిని సీఎం చంద్రబాబు దర్శించుకుంటారు.


రాత్రి 7:55 గంటల నుంచి 9:15 గంటల వరకు తిరుమలలోని శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం స్వామి వారికి పట్టువస్త్రాల సమర్పిస్తారు. ఆ తర్వాత రాత్రికి తిరుమలలోని శ్రీ గాయత్రి నిలయంలో ఆయన బస చేయనున్నారు. 16వ తేదీ ఉదయం 8:40 గంటలకు తిరుమల వీక్యూసీ-1లో పిల్‌గ్రిమ్ ఎక్స్‌పీరియన్స్ (Pilgrim Experience) సెంటర్‌ను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారు. అనంతరం ఉదయం 9:15 గంటలకు గో గర్భం డ్యామ్ సర్కిల్ వద్ద ఎలక్ట్రిక్ (E.V) బస్సులను ఆయన జెండా ఊపి ప్రారంభిస్తారు.


ఆ తర్వాత ఉదయం 9:35 గంటలకు తిరుమలలో ఎస్వీ (S.V.) మ్యూజియంను ప్రారంభస్తారు. ఆ రోజు ఉదయం10:25 నుంచి 11:25 గంటల వరకు శ్రీపద్మావతి రెస్ట్ హౌస్‌లో పలు సమావేశాల్లో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. ఆ రోజు మధ్యాహ్నం 12:25 గంటలకు తిరుపతి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 1:55 గంటలకు తిరిగి ఉండవల్లిలోని తన నివాసానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు చేరుకోనున్నారు.


సెప్టెంబర్ 15 నుంచి తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలకు రావాలంటూ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో రవిచంద్రతోపాటు ఆలయ పండితులు ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం చంద్రబాబును ఆహ్వానించిన సంగతి తెలిసిందే.


ఈ వార్తలు కూడా చదవండి..

బొమ్మదేవర.. భారత క్రీడా చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని సృష్టించారు: పవన్ కల్యాణ్

బ్రిక్స్ సదస్సు ద్వారా ప్రపంచ వేదికపై భారత్ సత్తా చాటింది: సీఎం చంద్రబాబు నాయుడు..

For More AP News And Telugu News

Updated Date - Sep 14 , 2026 | 04:06 PM