అమరావతి నిర్మాణాలపై తప్పుడు ప్రచారం మానుకోవాలి: మంత్రి నారాయణ
ABN , Publish Date - Jun 13 , 2026 | 09:25 AM
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణాలపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మంత్రి నారాయణ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అమరావతి హ్యాపీనెస్ట్ గృహాల నిర్మాణ వ్యయం కేంద్ర ప్రాజెక్టుల కంటే తక్కువని స్పష్టం చేశారు.
అమరావతి, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): ఏపీ రాజధాని అమరావతి నిర్మాణాలపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మంత్రి నారాయణ (AP Minister Narayana) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అమరావతి హ్యాపీనెస్ట్ గృహాల నిర్మాణ వ్యయం కేంద్ర ప్రాజెక్టుల కంటే తక్కువని స్పష్టం చేశారు. హ్యాపీనెస్ట్ గృహాల నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.3,393 మాత్రమే ఖర్చు అవుతోందని వివరించారు. అమరావతిలో మంత్రి ఈరోజు (శనివారం) పర్యటించారు. అమరావతిలో కొండవీటి వాగు.. పాల వాగులపై నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడారు.
అసత్య ప్రచారాలు మానుకోవాలి..
కేంద్ర నివాస సముదాయాల వ్యయం చదరపు అడుగుకు రూ.3,945 ఖర్చు చేస్తున్నట్లు మంత్రి నారాయణ వివరించారు. గెజిటెడ్ అధికారుల నివాసాల కోసం రూ.1003 కోట్లతో టెండర్ వేయగా చదరపు అడుగుకు రూ.3,684 మాత్రమే ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. సెంట్రల్ గవర్నమెంట్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌కి రూ.1234 కోట్లతో టెండర్ వేయగా, చదరపు అడుగుకు రూ3,945 ఖర్చు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. రాజధాని అభివృద్ధిలో భాగంగా సీఆర్డీఏ ఆధ్వర్యంలో వాగులపై 43 వంతెనలు, ఎల్పీఎస్ లేఅవుట్లలో మరో 26 వంతెనలు నిర్మాణంలో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ వివరాలు తెలుసుకున్న తర్వాత అయినా ప్రతిపక్ష నేత అమరావతి నిర్మాణాలపై అసత్య ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు.
వేగంగా 69 వంతెనల నిర్మాణ పనులు..
అమరావతిలో 69 వంతెనల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. వర్షాకాలం దృష్ట్యా నీటి ప్రవాహానికి ఆటంకాలు తొలగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వంతెనల వద్ద మట్టి, తాత్కాలిక కట్టలు తొలగించాలని అధికారులకు సూచించారు. కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కాలువల పనులపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని దిశానిర్దేశం చేశారు. అవసరమైతే జేసీబీలతో వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వచ్చే ఏడాది నాటికి ఎక్కువశాతం వంతెనల పనులు పూర్తి కానున్నాయని మంత్రి నారాయణ వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఏఐ లెర్నింగ్, క్వాంటం టెక్నాలజీతో విద్యార్థులకు భవిష్యత్తు నైపుణ్యాలు: సీఎం చంద్రబాబు
డీఎస్సీపై అపోహలు వద్దు.. అక్టోబర్‌లో మరో నోటిఫికేషన్: ఏపీ విద్యాశాఖ
Read Latest AP News And Telangana News And National News
And Telugu News