Share News

ప్రపంచం చూపు రాష్ట్రం వైపు!

ABN , Publish Date - Aug 19 , 2026 | 08:39 AM

దేశంలో కొత్త పెట్టుబడులను ఆకర్షించిన రాష్ట్రాల్లో ఏపీ కేవలం 24 నెలల్లోనే 9వ స్థానం నుంచి 2వ స్థానానికి ఎగబాకిందని మంత్రి లోకేశ్‌ ప్రకటించారు. మంగళవారం ట్విట్టర్‌ వేదికగా ఈ అంశాన్ని వెల్లడించారు.

ప్రపంచం చూపు రాష్ట్రం వైపు!

  • పెట్టుబడుల్లో 2వ స్థానానికి ఏపీ

  • 24 నెలల్లోనే సాధించాం: లోకేశ్‌

అమరావతి, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): దేశంలో కొత్త పెట్టుబడులను ఆకర్షించిన రాష్ట్రాల్లో ఏపీ కేవలం 24 నెలల్లోనే 9వ స్థానం నుంచి 2వ స్థానానికి ఎగబాకిందని మంత్రి లోకేశ్‌ ప్రకటించారు. మంగళవారం ట్విట్టర్‌ వేదికగా ఈ అంశాన్ని వెల్లడించారు. ‘‘విజనరీ నాయకుడు సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం పారిశ్రామిక శక్తిగా అత్యంత వేగంగా ఎదగడం గర్వకారణం. స్పష్టమైన విజన్‌, పారదర్శక పాలన, స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ రాష్ట్ర ప్రగతికి మూల స్తంభాలు. ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారులు ముందుకు వస్తున్నారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్‌ వైపు చూస్తోంది.’’ అని లోకేశ్‌ పేర్కొన్నారు.


వార్తలు కూడా చదవండి...

55కు పైగా అజెండా అంశాలతో ఏపీ క్యాబినెట్ భేటీ

నిర్మలా సీతారామన్ నాయకత్వంలో భారత్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది: పవన్

స్థానిక ఎన్నికలపై మాధవ్ కీలక వ్యాఖ్యలు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Aug 19 , 2026 | 08:39 AM