మహిళల్ని అవమానించడం వైసీపీ డీఎన్‌ఏలోనే ఉంది: లోకేశ్
ABN , Publish Date - Aug 01 , 2026 | 08:38 AM
మహిళల్ని అవమానించి, రాక్షస ఆనందం పొందడం వైసీపీ డీఎన్‌ఏలోనే ఉందని మంత్రి లోకేశ్ విమర్శించారు. ఈమేరకు ఎక్స్‌లో పోస్టు చేశారు.
మహిళల్ని అవమానించడం వైసీపీ డీఎన్‌ఏలోనే ఉంది: లోకేశ్
అమరావతి, జూలై 31(ఆంధ్రజ్యోతి): మహిళల్ని అవమానించి, రాక్షస ఆనందం పొందడం వైసీపీ డీఎన్‌ఏలోనే ఉందని మంత్రి లోకేశ్ విమర్శించారు. ఈమేరకు ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘సొంత తల్లిని, చెల్లిని గెంటేసిన చరిత్ర జగన్ రెడ్డి గారిదైతే కనిపించిన ప్రతి మహిళను అవమానించడం వైసీపీ నాయకుల సంస్కృతి. శ్రీకాకుళంలో విధుల్లో ఉన్న మహిళా ఎస్‌ఐపై వైసీపీ నాయకులు ప్రవర్తించిన తీరు తీవ్ర ఆక్షేపణీయం. మహిళల భద్రత, గౌరవంతో చెలగాటమాడితే సహించేది లేదు. మహిళా అధికారిపై దాష్టీకానికి ఒడిగట్టిన వైసీపీ గూండాలపై కఠిన చర్యలు తప్పవు’ అని స్పష్టం చేశారు.