మినీ మార్ట్‌ల ద్వారా రేషన్ బియ్యం బ్లాక్ మార్కెట్‌ను అడ్డుకుంటాం: మంత్రి నాదెండ్ల మనోహర్
ABN , Publish Date - Aug 02 , 2026 | 11:37 AM
మినీ మార్ట్‌ల ద్వారా రేషన్ బియ్యం బ్లాక్ మార్కెట్‌ను అడ్డుకుంటామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. ఇప్పటికే రేషన్ బియ్యం బ్లాక్ మార్కెట్‌ను చాలా వరకు అరికట్టామని స్పష్టం చేశారు.
విజయవాడ, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): మినీ మార్ట్‌ల ద్వారా రేషన్ బియ్యం బ్లాక్ మార్కెట్‌ను అడ్డుకుంటామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నాదెండ్ల మనోహర్(AP Minister Nadendla Manohar) వ్యాఖ్యానించారు. ఇప్పటికే రేషన్ బియ్యం బ్లాక్ మార్కెట్‌ను చాలా వరకు అరికట్టామని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు సూచనలతో తక్కువ ధరకు బియ్యం అందజేస్తున్నామని తెలిపారు. ఇటీవల బియ్యం ధరలు కిలోకు పది రూపాయలు పెరిగాయని వెల్లడించారు. ఈరోజు (ఆదివారం) విజయవాడలో మంత్రి నాదెండ్ల పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు.
ధరల స్థిరీకరణ విషయంలో సమీక్షిస్తున్నాం..
తమ పౌరసరఫరల శాఖ ఆధ్వర్యంలో 50, 52 కిలోల చొప్పున పదికిలోల బియ్యాన్ని అందజేస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ధరల స్థిరీకరణ విషయంలో ఎప్పటికప్పుడు తాము సమీక్షిస్తున్నామని చెప్పుకొచ్చారు. నేడు ఎక్కడ చూసినా కిలో రూ.64లు బియ్యం ఉందని తెలిపారు. తమ ప్రభుత్వం రూ.50లకే ఇస్తుందని వెల్లడించారు. 150 కేంద్రాలు ఏర్పాటు చేసి ఈ బియ్యాన్ని అందజేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఏపీలో వెయ్యి మినీ మార్ట్‌లు తొలిసారిగా ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఆ తర్వాత అదనంగా మరికొన్ని ప్రాంతాల్లో తక్కువ ధరలకు సరుకులు ఇస్తామని స్పష్టం చేశారు. వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా దాదాపు 70 రకాల నిత్యావసర వస్తువులను అందజేస్తామని తెలిపారు. రేషన్ షాపుల ద్వారా ఈ మినీమార్ట్‌ల ఏర్పాటుతో డీలర్లకు ఆదాయం పెరుగుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
అందుబాటులోకి తక్కువ ధరకు బియ్యం..
ఏపీవ్యాప్తంగా ఉన్న 150 రైతుబజార్లు, 500 రైస్‌మిల్ అవుట్‌లెట్ల ద్వారా తక్కువ ధరకు బియ్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. డీ-మార్ట్ తరహాలోనే నాణ్యమైన నిత్యావసర సరుకులను తక్కువ ధరలకే అందించడానికి వెయ్యి 'మీ మార్ట్'లను రేషన్ షాపుల ద్వారా ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఆగష్టు 15వ తేదీ నాటికి కొన్ని జిల్లాల్లో మినీ మార్ట్‌లు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పుకొచ్చారు. ఎల్‌నినో ప్రభావం వల్ల ఏపీలో వర్షపాతం 34శాతం మేరకు తగ్గవచ్చని తెలిపారు.
రైతులకు రూ.31,000కోట్లు చెల్లించాం..
రైతులు భూగర్భ జలాలపై ఆధారపడటం తగ్గించి, వర్షపాతం, కాలవల నీటి లభ్యత ఆధారంగానే వ్యవసాయ అధికారులు అందించే సూచనల మేరకు సాగు చేపట్టాలని మంత్రి సూచించారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే 94శాతం మంది రైతులకు రూ.31,000కోట్లు చెల్లించి తమ ప్రభుత్వం రికార్డు సృష్టించిందని తెలిపారు. పశ్చిమాసియా యుద్ధం, ఇంధన ధరల పెరుగుదల వల్ల బియ్యం ధరలు పెరిగాయని వెల్లడించారు. ధరల స్థిరీకరణ కమిటీ ద్వారా ప్రజలపై భారం పడకుండా నిర్ణయాలు తీసుకున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
వార్తలు కూడా చదవండి...
భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ
కష్టాల్లో ఉన్న ఏపీకి ప్రధాని మోదీ ఆక్సిజన్ ఇచ్చారు: సీఎం చంద్రబాబు
నమో సహకారంతోనే ఏపీలో అనేక అభివృద్ధి పనులు: మంత్రి లోకేశ్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News