రైతులకు అన్యాయం జరిగితే సహించబోం: మంత్రి అచ్చెన్నాయుడు
ABN , Publish Date - May 12 , 2026 | 03:21 PM
రొయ్యల ఫీడ్ ధరలను కొన్ని ఫీడ్ కంపెనీలు పెంచడంపై ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులతో చర్చించకుండా ధరలు పెంచడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు.
అమరావతి, మే 12 (ఆంధ్రజ్యోతి): రొయ్యల ఫీడ్ ధరలను కొన్ని ఫీడ్ కంపెనీలు పెంచడంపై ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులతో చర్చించకుండా ధరలు పెంచడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. వనామీ ఫీడ్‌పై రూ.8, టైగర్ ఫీడ్‌పై రూ.10లు కొన్ని ఫీడ్ కంపెనీలు పెంచాయని పేర్కొన్నారు. ఈరోజు(మంగళవారం) అమరావతి వేదికగా మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు.
APSADA చట్టాన్ని పాటించాలని ఫీడ్ కంపెనీలను మంత్రి హెచ్చరించారు. పెంచిన ధరల అమలు నిలిపివేయాలని నోటీసులు జారీ చేశారు. ఫీడ్ ధరల పెంపు విషయంపై APSADA చట్టప్రకారం కమిటీలో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. రైతుల ప్రయోజనాల పరిరక్షణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రైతులకు అన్యాయం జరిగితే సహించబోమని మందలించారు. ఆక్వా రైతుల పక్షాన ప్రభుత్వం ఎల్లప్పుడూ నిలుస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు భరోసా కల్పించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
టెక్నాలజీ హబ్‌గా ఏపీని తీర్చిదిద్దుతున్నాం: సీఎం చంద్రబాబు
ప్రజాసమస్యల పరిష్కారానికి పవన్ కల్యాణ్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటారు: అన్నామలై
అనధికార లౌడ్‌స్పీకర్లపై డీజీపీకి రఘురామ లేఖ
Read Latest AP News And Telangana News And International News And Telugu News