Share News

ఏఈ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చూస్తే కఠిన చర్యలు: మంత్రి గొట్టిపాటి

ABN , Publish Date - Aug 23 , 2026 | 08:51 AM

వివిధ విద్యుత్ రంగ సంస్థల్లో నిర్వహించే ఏఈ ఉద్యోగాల నియామక పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వ్యాఖ్యానించారు. 629 ఉద్యోగాలకు లక్షమందికి పైగా దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు.

ఏఈ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చూస్తే కఠిన చర్యలు: మంత్రి గొట్టిపాటి
AP Minister Gottipati Ravi Kumar,

అమరావతి, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): వివిధ విద్యుత్ రంగ సంస్థల్లో నిర్వహించే ఏఈ ఉద్యోగాల నియామక పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ (AP Minister Gottipati Ravi Kumar) వ్యాఖ్యానించారు. 629 ఉద్యోగాలకు లక్షమందికి పైగా దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు. ఈరోజు (ఆదివారం) అమరావతి వేదికగా మీడియాతో మంత్రి గొట్టిపాటి మాట్లాడారు. తమ ప్రభుత్వం ఎంతో పారదర్శకంగా రేపు నిర్వహిస్తున్న పరీక్షను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఏఈ ఉద్యోగాలపై చెప్పే చెప్పుడు మాటలు, ప్రలోభాలను అభ్యర్థులు ఎవ్వరూ నమ్మొద్దని పేర్కొన్నారు.


ఈ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఎవరైనా నిరుద్యోగులను మోసాగించాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి గొట్టిపాటి హెచ్చరించారు. ఏఈ ఉద్యోగాల పేరుతో ఎవరైనా ప్రలోభ పెడుతుంటే అభ్యర్థులు కూడా నేరుగా ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఖాళీల భర్తీ ద్వారా విద్యుత్ ఉద్యోగ అవకాశాలు కల్పించటంతో పాటు విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేయటమే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని ఉద్ఘాటించారు. 629 ఏఈల నియామకం ద్వారా విద్యుత్ రంగంలో ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందుతాయని వివరించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు.


వార్తలు కూడా చదవండి...

ఉద్యోగాలు, ప్రతిభకు దేశంలోనే నంబర్‌వన్ సిటీగా విశాఖ: సీఎం చంద్రబాబు

పవన్ కల్యాణ్ దిశానిర్దేశం.. శరవేగంగా అడవుల పునరుద్ధరణ కార్యక్రమం

ఈ ఏడాది మరో 3వేల టీచర్ పోస్టుల భర్తీ: మంత్రి లోకేశ్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Aug 23 , 2026 | 09:21 AM