Share News

ఏపీలో స్థానిక ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం

ABN , Publish Date - Apr 30 , 2026 | 09:50 PM

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ అంశంపై జరిగిన విచారణలో ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ ప్రభుత్వం తరపున కోర్టుకు పలు ముఖ్యమైన అంశాలను నివేదించారు.

ఏపీలో స్థానిక ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం
AP Local Elections

అమరావతి, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ అంశంపై జరిగిన విచారణలో ఏపీ హైకోర్టు (Andhra Pradesh High Court) కీలక నిర్ణయం తీసుకుంది. అడ్వొకేట్ జనరల్ (AG) దమ్మాలపాటి శ్రీనివాస్ ప్రభుత్వం తరపున కోర్టుకు పలు ముఖ్యమైన అంశాలను నివేదించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామక ప్రక్రియను పూర్తి చేసినట్లు తెలిపారు. దీంతో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రాథమిక ఏర్పాట్లు పూర్తయ్యాయని స్పష్టం చేశారు.


వేసవి సెలవుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించబోమని, ఎన్నికలను అనుకూల సమయంలో నిర్వహిస్తామని ఏజీ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలపై దాఖలైన పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్లు (PILs)పై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. బీసీల జనగణన సర్వే వేగంగా కొనసాగుతోందని చెప్పారు. మరో నెల రోజుల్లో ఈ సర్వే పూర్తవుతుందని వెల్లడించారు. ఈ సర్వే పూర్తయ్యాకే ఎన్నికల ప్రక్రియకు వెళ్లే అవకాశం ఉందని తెలిపారు. ఈ వివరాలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు.. ఈ కేసు విచారణను జులై మొదటి వారానికి వాయిదా వేసింది. అప్పటివరకు సర్వే పురోగతి, ఎన్నికల ఏర్పాట్లపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి...

ఇంధనం కొరతపై సీఎం చంద్రబాబు సమీక్ష.. రంగంలోకి యంత్రాంగం..

పెట్టుబడులతో ఏపీ కొత్త చరిత్ర సృష్టిస్తోంది: మంత్రి లోకేశ్

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Apr 30 , 2026 | 09:53 PM