Share News

డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాల్లో అక్రమాలు జరగలేదు: ఏపీ జూడో అసోసియేషన్

ABN , Publish Date - Sep 13 , 2026 | 11:30 AM

డీఎస్సీలో అక్రమాల ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ జూడో అసోసియేషన్ జనరల్ సెక్రటరీ వెంకట్ నామిశెట్టి స్పందించారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని స్పష్టం చేశారు.

డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాల్లో అక్రమాలు జరగలేదు: ఏపీ జూడో అసోసియేషన్
AP Judo Association

విజయవాడ, సెప్టెంబర్ 13 (ఆంధ్రజ్యోతి): డీఎస్సీలో అక్రమాల ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ జూడో అసోసియేషన్ జనరల్ సెక్రటరీ వెంకట్ నామిశెట్టి స్పందించారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని స్పష్టం చేశారు. వైసీపీ, సాక్షిమీడియా ద్వారా కూటమి ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని ధ్వజమెత్తారు. తమ జూడో అసోసియేషన్‌లో అక్రమాలు చేస్తే కొంతమందిని బహిష్కరించామని అన్నారు. తప్పు చేసిన వారు, అవినీతి చేసిన వారంతా ఒకచోట చేరి ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై నిందలు మోపుతున్నారని ఆగ్రహించారు. వైసీపీ ఆరోపణలను తాను ఖండిస్తే... సాక్షిలో తన మీద, తన కుమారుడి మీద కథనాలు ప్రసారం చేశారని దుయ్యబట్టారు.


అసలు విశాఖపట్నం ఎంపీ భరత్‌కు ఈ విషయంలో ఎలాంటి సంబంధం లేకపోయినా ఆయన పేరు ఎందుకు తెచ్చారని ప్రశ్నించారు. ఆ ఛానల్‌లో మాట్లాడిన ఆనం కిషోర్ రెడ్డి, కె.ఎన్. బాబు, సి. కిరణ్ కుమార్, ఆర్.కె. పురుషోత్తం, ఏసీబీ కేసులో అరెస్ట్ అయిన తెలంగాణ జూడో అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ కైలాష్ యాదవ్‌లు క్రిమినల్స్ అని ఆరోపించారు. వారిపై కోర్టు కేసులు, ఫేక్ సర్టిఫికెట్ల ఫిర్యాదులు ఉన్నాయని తెలిపారు. మంత్రి నారా లోకేశ్‌ను టార్గెట్ చేస్తూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.


డీఎస్సీ జరిగే సమయంలో తాను కానీ, ఎంపీ భరత్ కానీ అసోసియేషన్‌లోనే లేమని స్పష్టం చేశారు. ఈ తప్పుడు ప్రచారాన్ని విరమించుకోకపోతే సాక్షి ఛానల్‌పై చట్టపరంగా పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. జూడో అసోసియేషన్ అవకతవకలపై విచారణ జరిపించాలని ఏపీ హైకోర్టు విజిలెన్స్ డిపార్ట్‌మెంట్‌ను ఆదేశించిందని, ఆ విచారణకు తాము పూర్తిగా సహకరిస్తామని చెప్పారు. ప్రత్యర్థులు చూపిస్తున్న ఆధారాలు, సర్టిఫికెట్లు వందశాతం ఫేక్ అని తాను నిరూపిస్తానని వెంకట్ నామిశెట్టి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆరోగ్యవంతమైన ఏపీ కోసం ఎన్డీఏ సర్కార్ పనిచేస్తుంది: సీఎం చంద్రబాబు

క్వాంటం బయో వ్యాలీపై సీఎం చంద్రబాబు ఆలోచన బాగుంది: జేపీ నడ్డా

ఏపీలో భారీ వర్షాలు, వరదలపై ప్రజలను అప్రమత్తం చేయండి..అధికారులకు పవన్ దిశానిర్దేశం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 13 , 2026 | 12:27 PM