Share News

గుంటూరు ఘటనపై హోం మంత్రి అనిత సీరియస్

ABN , Publish Date - Jul 18 , 2026 | 09:09 AM

గుంటూరులో ఓ మహిళపై దాడికి పాల్పడిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి అనిత సీరియస్ అయ్యారు.

గుంటూరు ఘటనపై హోం మంత్రి అనిత సీరియస్
AP Home Minister Vangalapudi Anita

అమరావతి, జులై 18 (ఆంధ్రజ్యోతి): గుంటూరులో ఓ మహిళపై దాడికి పాల్పడిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత (AP Home Minister Vangalapudi Anita) సీరియస్ అయ్యారు. ఈ విషయంపై గుంటూరు జిల్లా ఎస్పీతో అనిత మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనకు కారణమైన బాధ్యులపై వెంటనే కఠిన చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసు విచారణలో నిర్లక్ష్యం వహించిన పోలీసులపైనా చర్యలకు హోం మంత్రి ఆదేశించారు. ఈ ఘటన జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడంలో సీఐ ఎందుకు నిర్లక్ష్యం చేశారని హోం మంత్రి ప్రశ్నించారు.


ఆడబిడ్డల జోలికొస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని హోం మంత్రి హెచ్చరించారు. నేరస్థులను నేరస్థులుగానే చూడాలి.. తప్ప పార్టీల పరంగా చూడరాదని తేల్చిచెప్పారు. ఆయా పార్టీల ముసుగులో నేరాలకు పాల్పడేవారిపై కఠినంగా ఉండాలని హోం మంత్రి అనిత ఆదేశించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

విమాన ప్రయాణికులపై భారం పడనివ్వబోం: రామ్మోహన్

పలాస ఘటనలో తప్పు ఎవరూ చేసినా ఉపేక్షించబోం: హోం మంత్రి అనిత

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jul 18 , 2026 | 12:14 PM