Share News

లిథియం, గాలియం నిక్షేపాల అన్వేషణపై ఎన్జీఆర్ఐతో ఏపీ ప్రభుత్వం ఎంఓయూ

ABN , Publish Date - Aug 12 , 2026 | 08:40 PM

లిథియం, గాలియం నిక్షేపాల అన్వేషణపై ఎన్జీఆర్ఐతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంది. ఐఐటీ(ఐఎస్‌ఎం) ధన్‌బాద్‌తో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటుకు ఈ ఒప్పందం జరిగింది.

లిథియం, గాలియం నిక్షేపాల అన్వేషణపై ఎన్జీఆర్ఐతో ఏపీ ప్రభుత్వం ఎంఓయూ
AP Government

అమరావతి, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): లిథియం, గాలియం నిక్షేపాల అన్వేషణపై ఎన్జీఆర్ఐతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Government) ఎంఓయూ కుదుర్చుకుంది. ఐఐటీ(ఐఎస్‌ఎం) ధన్‌బాద్‌తో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటుకు ఈ ఒప్పందం జరిగింది. ఏపీలో కీలక ఖనిజాల అన్వేషణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. కడప బేసిన్ పరిధిలోని వేంపల్లె పరిసరాల్లో లిథియం, గాలియం ఖనిజాల నిక్షేపాలపై విస్తృత స్థాయి అన్వేషణకు చర్యలు చేపడుతుంది.


ఈ మేరకు సీఎస్‌ఐఆర్‌–నేషనల్‌ జియోఫిజికల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎన్‌జీఆర్‌ఐ), రాష్ట్ర గనులు–భూగర్భశాస్త్ర శాఖల మధ్య ఎంఓయూ జరిగింది. సీఎం చంద్రబాబు సమక్షంలో ఎన్‌జీఆర్‌ఐ- ఏపీ ప్రభుత్వం ఈరోజు (బుధవారం) ఒప్పందం చేసుకున్నాయి. తుమ్మలపల్లె, పరిసర ప్రాంతాల్లో ఎన్‌జీఆర్‌ఐ నిర్వహించిన ప్రాథమిక పరిశోధనల్లో లిథియం, గాలియం ఖనిజాల ఆనవాళ్లు గుర్తించారు. లిథియం గరిష్ఠంగా 1,000 పీపీఎం, గాలియం 250 పీపీఎం వరకు ఉన్నట్లు అంచనా వేశారు.


ఈ విషయంపై మరింత అధ్యయనం చేసేందుకు ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. నేషనల్‌ మినరల్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ ట్రస్ట్‌ నుంచి వందశాతం నిధులతో... రూ.140 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు ఏపీలోని గనుల రంగంలో పరిశోధన, టెక్నాలజీ, స్కిల్ డెవలప్మెంట్ వంటి అంశాలకు సంబంధించి ఐఐటీ(ఐఎస్‌ఎం) ధన్‌బాద్‌–టెక్స్‌మిన్‌, గనుల శాఖ మధ్య సీఎం సమక్షంలో మరో ఎంఓయూ కుదిరింది. దీని ద్వారా రాష్ట్రంలో గనులకు సంబంధించి సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ను ఐఐటీ(ఐఎస్‌ఎం) ధన్‌బాద్‌ ఏర్పాటు చేసింది.


వార్తలు కూడా చదవండి...

వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు సహకరించాలి: సీఎం చంద్రబాబు

అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి తొలగిన అడ్డంకులు

ఆక్వా రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Aug 12 , 2026 | 09:49 PM