Share News

శానిటైజర్ల దుర్వినియోగం.. ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి కథనాలపై స్పందించిన ఏపీ ప్రభుత్వం

ABN , Publish Date - Sep 04 , 2026 | 05:22 PM

శానిటైజర్ల దుర్వినియోగంపై ఏబీఎన్ - ఆంధ్రజ్యోతిలో వరుస కథనాలు ప్రసారమయ్యాయి. ఏబీఎన్ కథనాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది.

శానిటైజర్ల దుర్వినియోగం.. ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి కథనాలపై స్పందించిన ఏపీ ప్రభుత్వం
ABN Andhrajyothy Effect

అమరావతి, సెప్టెంబర్ 4, (ఆంధ్రజ్యోతి): శానిటైజర్ల దుర్వినియోగంపై ఏబీఎన్ - ఆంధ్రజ్యోతిలో(ABN Andhrajyothy Effect) వరుస కథనాలు ప్రసారమయ్యాయి. ఏబీఎన్ కథనాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Government) స్పందించింది. ఈ క్రమంలో ఇథనాల్ శానిటైజర్ల దుర్వినియోగంపై ఏపీ డ్రగ్స్ కంట్రోల్ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇథనాల్ శానిటైజర్ల లైసెన్స్ మినహాయింపు ఎత్తివేయాలని కేంద్రానికి లేఖ రాశారు. మద్యం ప్రత్యామ్నాయంగా శానిటైజర్లు వాడుతున్నట్లు గుర్తించామని తెలిపారు.


విజయవాడలో భారీగా ఇథనాల్ శానిటైజర్ల విక్రయాలు వెలుగులోకి వచ్చాయని డీసీఏ అధికారులు అన్నారు. పటమట సాయి వెంకటేశ్వర ఫార్మసీలో రికార్డులు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఏడాదిన్నరలో 33,586 శానిటైజర్ సీసాల విక్రయించినట్లు గుర్తించామని అన్నారు. మూడు రిటైల్ మెడికల్ షాపులపై లైసెన్స్ రద్దు చర్యలు చేపట్టామని తెలిపారు. కొవిడ్ కాలంలో ఇచ్చిన లైసెన్స్ మినహాయింపే ఈ దుర్వినియోగానికి కారణమని చెప్పారు. ఇథనాల్ లేని శానిటైజర్లు మార్కెట్‌లో అందుబాటులోనే ఉన్నాయని తెలిపారు. ఎస్.ఓ.245(ఈ) నోటిఫికేషన్‌ను సమీక్షించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశామని ఏపీ డ్రగ్స్ కంట్రోల్ అధికారులు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గొడ్డలి పార్టీ అన్నింట్లోనూ క్రెడిట్‌ చోరీకి యత్నిస్తోంది: సీఎం చంద్రబాబు

చట్టాన్ని ఉల్లంఘించిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు: మంత్రి లోకేశ్

గుంటూరు జిల్లా పోలీసులపై ఏపీ హైకోర్టు సీరియస్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 04 , 2026 | 05:40 PM