ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. బీసీ డెడికేటెడ్ కమిషన్ గడువు పొడిగింపు
ABN , Publish Date - Aug 31 , 2026 | 08:16 PM
ఆంధ్రప్రదేశ్‌లో బీసీ డెడికేటెడ్ కమిషన్ గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. కమిషన్ కాలపరిమితిని సెప్టెంబర్ 30వ తేదీ వరకు పెంచుతూ బీసీ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
అమరావతి, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో బీసీ డెడికేటెడ్ కమిషన్ గడువును రాష్ట్ర ప్రభుత్వం (AP Government) పొడిగించింది. కమిషన్ కాలపరిమితిని సెప్టెంబర్ 30వ తేదీ వరకు పెంచుతూ బీసీ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జీవో ఎంఎస్ నంబర్ -11ను ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో బీసీ డెడికేటెడ్ కమిషన్ తన అధ్యయనాన్ని కొనసాగించేందుకు మరింత సమయం లభించనుంది.
రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో కొనసాగుతున్న బీసీ డెడికేటెడ్ కమిషన్ ప్రధానంగా స్థానిక సంస్థల్లో బీసీల వెనుకబాటుతనంపై అధ్యయనం చేస్తోంది. గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో బీసీల సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను కమిషన్ పరిశీలిస్తోంది.
స్థానిక సంస్థల్లో బీసీలకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించేందుకు అవసరమైన అంశాలపై కమిషన్ అధ్యయనం చేస్తోంది. ఇందులో భాగంగా వివిధ ప్రాంతాల్లో బీసీల పరిస్థితి, వారి ప్రాతినిధ్యం, వెనుకబాటుతనానికి సంబంధించిన అంశాలను పరిశీలించే ప్రక్రియ కొనసాగుతోంది. కమిషన్ సేకరించిన సమాచారం, అధ్యయనం ఆధారంగా ప్రభుత్వానికి నివేదిక, సిఫార్సులు అందించే అవకాశం ఉంది.
బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లకు సంబంధించిన నిర్ణయాలకు డెడికేటెడ్ కమిషన్ అధ్యయనం కీలకంగా మారనుంది. కమిషన్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తదుపరి చర్యలు చేపట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కమిషన్ గడువు పొడిగింపు ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం చంద్రబాబు పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన ఖరారు.. షెడ్యూల్ ఇదే..
వైసీపీ హయాంలో శ్రీవారి ఆస్తులను కొల్లగొట్టారు: బొండా ఉమా
తిరుపతి నైలిట్ సంస్థ మూసివేతపై క్లారిటీ.. అసలు విషయమిదే
Read Latest AP News And Telangana News And National News
And Telugu News