Share News

18 యూనివర్సిటీల ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిళ్లు రద్దు

ABN , Publish Date - Jul 31 , 2026 | 07:55 AM

యూనివర్సిటీల్లో పరిపాలనా వ్యవహారాలపై నిర్ణయాలు తీసుకునే ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిళ్లను ప్రభుత్వం రద్దు చేసింది. రాష్ట్రంలోని మొత్తం 18 యూనివర్సిటీలలోని మండళ్లను రద్దుచేస్తూ ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్‌ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. త్వరలో మండళ్లు, వాటి సభ్యుల పదవీకాలం ముగియనుంది.

18 యూనివర్సిటీల ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిళ్లు రద్దు
AP Education News

  • ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

  • 18 యూనివర్సిటీల ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిళ్లు రద్దు

అమరావతి, జూలై 30 (ఆంధ్రజ్యోతి): యూనివర్సిటీల్లో పరిపాలనా వ్యవహారాలపై నిర్ణయాలు తీసుకునే ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిళ్లను ప్రభుత్వం రద్దు చేసింది. రాష్ట్రంలోని మొత్తం 18 యూనివర్సిటీలలోని మండళ్లను రద్దుచేస్తూ ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్‌ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. త్వరలో మండళ్లు, వాటి సభ్యుల పదవీకాలం ముగియనుంది. అయితే ఈలోపే గవర్నర్‌ అనుమతితో ఆ మండళ్ల రద్దుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జేఎన్‌టీయూ గురజాడ, జేఎన్‌టీయూ అనంతపురం, జేఎన్‌టీయూ కాకినాడ, వైఎ్‌సఆర్‌ ఆర్కిటెక్చర్‌, అబ్దుల్‌ హక్‌ ఉర్దూ, ద్రవిడియన్‌, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, రాయలసీమ, కృష్ణా, ఆంధ్ర కేసరి, విక్రమ సింహపురి, బీఆర్‌ అంబేడ్కర్‌, యోగి వేమన, ఆదికవి నన్నయ, శ్రీకృష్ణదేవరాయ, ఆచార్య నాగార్జున, ఎస్వీయూ, ఆంధ్రా యూనివర్సిటీల ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిళ్లను రద్దుచేస్తూ వేర్వేరు ఉత్తర్వులు జారీచేశారు. అలాగే ఆంధ్రా, నాగార్జున, పద్మావతి యూనివర్సిటీలకు కొత్త కౌన్సిళ్లను నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.


వార్తలు కూడా చదవండి...

హిందుత్వం అంటే మతం కాదు జీవన విధానం: వెంకయ్యనాయుడు

కియాతో ఏపీ ప్రభుత్వం ఎంఓయూ

గాదె సాయి కృష్ణ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం.. వారం రోజుల కస్టడీకి మాజీ సీఐ నాగరాజు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jul 31 , 2026 | 07:55 AM