Share News

పీజీ వైద్యులతో 24 గంటలకు మించి డ్యూటీ చేయించకూడదు.. ఏపీ సర్కార్ ఆదేశాలు

ABN , Publish Date - Aug 28 , 2026 | 05:56 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పీజీ వైద్యులను 24 గంటలకు మించి డ్యూటీ చేయించకూడదని ఆదేశించింది.

పీజీ వైద్యులతో 24 గంటలకు మించి డ్యూటీ చేయించకూడదు.. ఏపీ సర్కార్ ఆదేశాలు
AP Government

అమరావతి, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Government) మరో కీలక నిర్ణయం తీసుకుంది. పీజీ వైద్యులను 24 గంటలకు మించి డ్యూటీ చేయించకూడదని ఆదేశించింది. నైట్‌ డ్యూటీ తర్వాత మరుసటి రోజు తప్పనిసరిగా సెలవు ఇవ్వాలని సూచించింది. వారానికి ఒక రోజు పూర్తి సెలవు ఇవ్వాలని ఆదేశించింది. పూర్వ ఉత్తర్వులను కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసింది. లేకపోతే ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్లపై చర్యలు చేపడతామని డీఎంఈ డాక్టర్‌ విష్ణువర్ధన్‌ హెచ్చరించారు.


ఇవి కూడా చదవండి..

డంపింగ్ యార్డ్ రహిత మున్సిపాలిటీలుగా ఏపీని మారుస్తాం: మంత్రి నారాయణ

నేపాల్ వరదలు.. ఏపీ వాసులు గల్లంతు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Aug 28 , 2026 | 06:02 PM