Share News

పింగళి వెంకయ్యకు నివాళులు అర్పించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్

ABN , Publish Date - Aug 02 , 2026 | 09:45 AM

త్రివర్ణ పతాక రూపకర్త పింగళి వెంకయ్య 150వ జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్మరించుకున్నారు. జాతీయ పతాక గౌరవాన్ని నిలబెట్టారని కొనియాడారు.

పింగళి వెంకయ్యకు నివాళులు అర్పించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్
Pingali Venkayya 150th Birth Anniversary

అమరావతి, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): త్రివర్ణ పతాక రూపకర్త పింగళి వెంకయ్య 150వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) నివాళులు అర్పించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా సీఎం పోస్టు పెట్టారు. జాతీయ పతాకాన్ని రూపుదిద్ది, అశేష భారతావనిలో దేశభక్తి ఇనుమడింపజేశారని కొనియాడారు. జాతిపిత ఆత్మీయాభిమానాలను సొంతం చేసుకున్న పింగళి వెంకయ్య చరితార్థుడని కీర్తించారు. దేశభక్తునిగా, జాతీయ పతాక రూపకర్తగా భారతజాతికి చిరస్మరణీయ సేవలు అందించారని సీఎం చంద్రబాబు ప్రశంసించారు.


పింగళి వెంకయ్య త్రివర్ణ పతాకాన్ని భారత్‌కు అందించారు: పవన్ కల్యాణ్

పింగళి వెంకయ్య 150వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) స్మరించుకున్నారు. మన ఐక్యత, స్వేచ్ఛ, జాతీయ గర్వానికి శాశ్వత చిహ్నమైన త్రివర్ణ పతాకాన్ని భారత్‌కు అందించారని కొనియాడారు. ఆ దార్శనికుడికి హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నానని పేర్కొన్నారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం ఓ ప్రకటనలో తెలిపారు.


ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా, భట్లపెనుమర్రు గ్రామంలో పింగళి వెంకయ్య జన్మించారని పవన్ కల్యాణ్ తెలిపారు. దేశానికి అత్యంత ప్రియమైన చిహ్నాన్ని ఆయన అందించడం ప్రతి తెలుగు వ్యక్తికి అపారమైన గర్వకారణమని చెప్పుకొచ్చారు. పింగళి వెంకయ్య అసాధారణ వారసత్వం మన జాతీయ పతాక గౌరవాన్ని, స్ఫూర్తిని నిలబెట్టడానికి తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.


వార్తలు కూడా చదవండి...

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ

కష్టాల్లో ఉన్న ఏపీకి ప్రధాని మోదీ ఆక్సిజన్‌ ఇచ్చారు: సీఎం చంద్రబాబు

నమో సహకారంతోనే ఏపీలో అనేక అభివృద్ధి పనులు: మంత్రి లోకేశ్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Aug 02 , 2026 | 10:40 AM