అజిత్ తల్లి మోహిని మణి మృతి.. పవన్ కల్యాణ్ సంతాపం
ABN , Publish Date - May 31 , 2026 | 04:27 PM
ప్రముఖ తమిళ నటుడు అజిత్ కుమార్ మాతృమూర్తి మోహిని మణి మృతిపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంతాపం వ్యక్తం చేశారు. మోహిని మణి మరణ వార్త తనను తీవ్రంగా కలచివేసిందని తెలిపారు.
అమరావతి, మే 31 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ తమిళ నటుడు అజిత్ కుమార్ మాతృమూర్తి మోహిని మణి మృతిపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) సంతాపం వ్యక్తం చేశారు. మోహిని మణి మరణ వార్త తనను తీవ్రంగా కలచివేసిందని తెలిపారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు పవన్ కల్యాణ్. మోహిని మణి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. తల్లిని కోల్పోయిన బాధ నుంచి అజిత్ కుమార్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
అలాగే ఈ క్లిష్ట సమయంలో అజిత్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని డిప్యూటీ సీఎం తెలిపారు. కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, ఈ విషాదాన్ని ఎదుర్కొనే శక్తిని పొందాలని కోరుకుంటున్నానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు కూడా అజిత్ కుటుంబానికి సంతాపం తెలిపారు. అభిమానులు సామాజిక మాధ్యమాల ద్వారా మోహిని మణికి నివాళులు అర్పిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
విజయవాడలో ‘పెద్ది’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ముఖ్య అతిథిగా పవన్ కల్యాణ్..!
పోలీసులపై దాడులు సహించం.. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం: అనిత
Read Latest AP News And Telangana News And National News
And Telugu News