ఉద్యోగాల కల్పనపై ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్.. మంత్రివర్గ ఉపసంఘం కీలక నిర్ణయాలు
ABN , Publish Date - Apr 30 , 2026 | 07:21 PM
ఏపీ మంత్రివర్గ ఉపసంఘ సమావేశం ఈరోజు రాష్ట్ర సచివాలయంలోని ఐదోబ్లాక్‌లో జరిగింది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై అధికారులతో మంత్రులు చర్చించారు.
అమరావతి, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): ఏపీ మంత్రివర్గ ఉపసంఘ సమావేశం (AP Cabinet Sub Committee Meet) ఈరోజు (గురువారం) రాష్ట్ర సచివాలయంలోని ఐదోబ్లాక్‌లో జరిగింది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై అధికారులతో మంత్రులు చర్చించారు. ప్రధానంగా ఏపీలో 20 లక్షలకు పైగా ఉద్యోగ కల్పన లక్ష్యంపై మంత్రులు మాట్లాడారు. ఉద్యోగాల సృష్టిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. అలాగే, ఇన్వెస్ట్‌మెంట్, ఎంప్లాయిమెంట్‌పై మంత్రులు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో మంత్రులు కందుల దుర్గేశ్, టీజీ భరత్, గొట్టిపాటి రవి కుమార్, కొండపల్లి శ్రీనివాస్, సీఎస్ జి. సాయిప్రసాద్ హాజరయ్యారు.
ఉద్యోగ వివరాలు ఒకే పోర్టల్‌లో నమోదు చేయాలని మంత్రులు ఆదేశించారు. పారదర్శకంగా ఉద్యోగ డేటా నమోదు చేయాలని సూచించారు. శాఖల వారీగా నిరంతర పర్యవేక్షణకు ఆదేశాలు జారీ చేశారు. భారీ, మధ్య, చిన్న పరిశ్రమల స్థాపనపై అధికారులు దృష్టిసారించాలని అన్నారు. ఎంఎస్ఎంఈల ద్వారా ఉద్యోగాల విస్తరణకు ప్రాధాన్యం కల్పించాలని చెప్పారు. ఉద్యోగాల కల్పన వివరాలు ఖచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. అలాగే, పెట్టుబడులు – ఉద్యోగాల అనుసంధానంపై మంత్రులు దృష్టి సారించారు. ఆయా అంశాలపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో మంత్రులు సమగ్రంగా చర్చించారు. ఉద్యోగావకాశాల పెంపు దిశగా చర్యలు వేగవంతం చేయాలని అధికారులకు మంత్రులు దిశానిర్దేశం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఇంధనం కొరతపై సీఎం చంద్రబాబు సమీక్ష.. రంగంలోకి యంత్రాంగం..
పెట్టుబడులతో ఏపీ కొత్త చరిత్ర సృష్టిస్తోంది: మంత్రి లోకేశ్
Read Latest AP News And Telangana News And International News And Telugu News