Share News

మార్చి 7వరకు అసెంబ్లీ సమావేశాలు.. పలు అంశాలపై చర్చ

ABN , Publish Date - Feb 11 , 2026 | 12:40 PM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై బిజినెస్ అడ్వైజరీ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. మార్చి 7వ తేదీ వరకు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది.

మార్చి 7వరకు అసెంబ్లీ సమావేశాలు.. పలు అంశాలపై చర్చ
AP Assembly Budget Session

అమరావతి, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల(AP Assembly Budget Session) నిర్వహణపై బిజినెస్ అడ్వైజరీ కమిటీ(BAC) కీలక నిర్ణయాలు తీసుకుంది. మార్చి నెల 7వ తేదీ వరకు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. ప్రతిరోజూ ఉదయం గం.9:00 నుంచి మధ్యాహ్నం గం.1:30 వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈనెల 14న బడ్జెట్ సమావేశం నిర్వహించనుంది. 15, 16న సెలవులు కాబట్టి 17, 18వ తేదీల్లో బడ్జెట్‌పై చర్చ, 18న రాష్ట్ర పద్దుపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వివరణ ఉంటుంది.


19వ తేదీ నుంచి 8 పనిదినాలు, డిమాండ్ల గ్రాంట్లపై అసెంబ్లీ బీఏసీ చర్చించనుంది ఈ నెల 28న శనివారం నాడు కూడా అసెంబ్లీ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగనున్నాయి. మార్చి 1, 2, 3వ తేదీల్లో అసెంబ్లీకి సెలవు దినాలుగా నిర్ణయించింది. మార్చి 6, 7న బడ్జెట్‌పై మరోసారి చర్చించనున్నారు. ఆ తర్వాత అవసరం మేరకు అసెంబ్లీ సమావేశాలను పొడిగించాలా? వద్దా? అనే విషయమై అసెంబ్లీ బీఏసీ నిర్ణయించనుంది. అసెంబ్లీ సమావేశాల్లో రోజూ జీరో అవర్ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీ అసెంబ్లీలో వైసీపీ వాకౌట్.. 11 నిమిషాల్లోనే మాజీ సీఎం జగన్ బయటకు..

మంత్రి కందుల దుర్గేశ్‌కు మావోయిస్టుల పేరిట బెదిరింపు లేఖ.!

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 11 , 2026 | 01:07 PM