అమరావతి స్టీల్ బ్రిడ్జిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు: ఏడీసీఎల్
ABN , Publish Date - May 15 , 2026 | 03:33 PM
బకింగ్ హామ్ కెనాల్‌పై నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జి గడ్డర్లు ఒరిగిపోయాయంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్(ఏడీసీఎల్) స్పష్టం చేసింది. స్టీల్ వంతెనల నిర్మాణంలో అత్యంత పొడవైన గడ్డర్లు తయారుచేసి జాయింట్ చేస్తారని చెప్పింది.
అమరావతి, మే 15 (ఆంధ్రజ్యోతి): బకింగ్ హామ్ కెనాల్‌పై నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జి గడ్డర్లు ఒరిగిపోయాయంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్(ఏడీసీఎల్) స్పష్టం చేసింది. ఏడీసీఎల్ విడుదల చేసిన వివరణలో, స్టీల్ బ్రిడ్జిల నిర్మాణంలో అత్యంత పొడవైన గడ్డర్లను ప్రత్యేక సాంకేతిక విధానాలతో తయారుచేసి జాయింట్ చేస్తారని తెలిపింది. ఈ ప్రక్రియలో గడ్డర్లు మిల్లీమీటర్ల స్థాయిలో ఖచ్చితత్వంతో బేరింగ్‌లపై అమర్చాల్సి ఉంటుందని పేర్కొంది.
ఒకవేళ గడ్డర్లు సరైన స్ట్రైట్ లైన్‌లో కూర్చోని పరిస్థితుల్లో, జాయింట్లను విడదీసి మళ్లీ సరిచేయడం సాధారణ సాంకేతిక ప్రక్రియేనని వివరించింది. వంతెన నిర్మాణంలో ఎలాంటి లోపాలు లేవని, నిర్మాణ భాగాలను తొలగించాల్సిన అవసరం కూడా రాలేదని ఏడీసీఎల్ స్పష్టం చేసింది. గడ్డర్ల అమరికలో ఇంజినీరింగ్ ప్రమాణాల ప్రకారం చిన్న సవరణలు మాత్రమే చేపట్టినట్లు తెలిపింది. స్టీల్ బ్రిడ్జి నిర్మాణం అత్యంత భద్రతా ప్రమాణాలతో కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. బకింగ్‌హామ్ కెనాల్‌పై నిర్మిస్తున్న ఈ స్టీల్ వంతెన ఆధునిక సాంకేతికతతో రూపుదిద్దుకుంటోందని, దీని నిర్మాణంలో నాణ్యత, భద్రత అంశాలకు అత్యున్నత ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఏడీసీఎల్ పేర్కొంది. ప్రజలు అసత్య ప్రచారాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి...
వారానికి ఒక రోజు నో వెహికల్ డే: సీఎం చంద్రబాబు
స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన ఫోకస్.. క్షేత్రస్థాయిలో కార్యాచరణ
బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై పరువు నష్టం దావా వేస్తా.. మంత్రి వార్నింగ్
Read Latest AP News And Telangana News And International News And Telugu News