పల్నాడు జిల్లాలో విషాద ఘటన.. కూతురిని నడుముకి కట్టుకుని కాలువలో దూకిన తల్లి
ABN , Publish Date - Apr 08 , 2026 | 01:41 PM
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. కన్నకూతురిని నడుముకు కట్టుకుని, ఒక తల్లి సాగర్ కుడి కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
పల్నాడు జిల్లా, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి): పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. కన్నకూతురిని నడుముకు కట్టుకుని, ఒక తల్లి సాగర్ కుడి కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మాచర్ల మండలం తాళ్లపల్లి సమీపంలోని నాగార్జున సాగర్ కుడి కాలువ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సదరు మహిళ తన చిన్నారి కూతురిని కాలువలోకి పడిపోకుండా తన నడుముకు గట్టిగా కట్టుకుంది. అనంతరం కాలువలోకి దూకి ప్రాణాలు తీసుకుంది. నీటి ఉధృతికి ఇద్దరూ ఊపిరాడక మృతి చెందారు. కాలువలో మృతదేహాలు తేలుతుండటం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. తల్లీబిడ్డల మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం మాచర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ తల్లి అంతటి కఠిన నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. కుటుంబ కలహాలా లేక ఆర్థిక ఇబ్బందులా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఒకేసారి తల్లీబిడ్డలు మృతి చెందడంతో తాళ్లపల్లి, మాచర్ల ప్రాంతాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి...
ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై దాడులు తగవు.. వైసీపీపై పవన్ కల్యాణ్ ధ్వజం
నిజాలు మాట్లాడితే భౌతిక దాడులా.. వైసీపీపై రామ్మోహన్ ధ్వజం
ఉన్నత విద్యపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్.. అధికారులకు కీలక ఆదేశాలు
Read Latest AP News And Telangana News And International News And Telugu News