ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా స్వాతి రెడ్డి నియామకం.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ABN , Publish Date - Oct 13 , 2026 | 07:52 PM
ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ సభ్యురాలిగా స్వాతి రెడ్డి అలియాస్ గౌతమి శ్వేతను నియమిస్తూ.. రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అమరావతి, అక్టోబర్ 13: రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలిగా స్వాతిరెడ్డి ఎంపికయ్యారు. ఈ మేరకు రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
గత ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసినందుకు స్వాతిరెడ్డిని సోషల్ మీడియా వేదికగా వైసీపీ వేధింపులకు గురి చేసింది. వ్యక్తిగత దూషణలకు పాల్పడి.. మానసికంగా వేధించింది. అయినప్పటికీ.. తాను నమ్మిన సిద్ధాంతాలను వదలకుండా టీడీపీ పార్టీలో సేవలందించిన స్వాతి రెడ్డి ధైర్యాన్ని మెచ్చి.. ప్రభుత్వం మహిళా కమిషన్ సభ్యురాలిగా ఆమెను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీవ్యాప్తంగా 5 వేల ఆలయాల నిర్మాణమే మా లక్ష్యం:మంత్రి ఆనం
ఇంద్రకీలాద్రిపై గాయత్రీ దేవి అలంకరణలో కనకదుర్గమ్మ
విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న ఎంపీ భరత్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News