దుస్తులు లేకుండా గోతిలో వ్యక్తి.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ప్రజలు.. అసలేమైందంటే..
ABN , Publish Date - Nov 09 , 2026 | 06:50 AM
తూర్పుగోదావరిజిల్లాలోని నల్లజర్ల మండలంలో ప్రకాశరావుపాలెంలో దీపావళి అమావాస్య నాడు క్షుద్ర పూజలు కలకలం సృష్టించాయి.
తూర్పుగోదావరిజిల్లా, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లాలోని నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెంలో దీపావళి అమావాస్య నాడు క్షుద్ర పూజలు కలకలం సృష్టించాయి. గ్రామ శివారులోని వైస్ కళాశాల పక్కన ఉన్న ఆలయం వద్ద గొయ్యి తీసి అందులో దుస్తులు లేకుండా పూజలు చేస్తుండగా ఓ వ్యక్తిని స్థానికులు గమనించారు.
స్థానికులు అతడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని నిలదీశారు. ఈ ఘటన స్థలంలో పసుపు, కుంకుమ, అన్నం ముద్దలు లభ్యమయ్యాయి. సమాచారం అందగానే పోలీసులు అక్కడకు చేరుకుని వివరాలు సేకరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీలో పల్లె పోరుకు ముహూర్తం ఖరారు.. ఈ నెల 13న షెడ్యూల్
దేశ నిర్మాణంలో అడ్వాణీ సేవలు వెలకట్టలేనివి: సీఎం చంద్రబాబు
కృష్ణా జిల్లాలో అనుమానాస్పద స్థితిలో విద్యార్థి మృతి.. పాఠశాలపై తల్లిదండ్రుల అనుమానం
Read Latest AP News And Telangana News And National News
And Telugu News